https://oktelugu.com/

Suryapet: ఈ మహిళా ప్రిన్సిపల్ పచ్చి తాగుబోతు.. గురుకులాన్ని వైన్ షాప్ గా మార్చింది వీడియో వైరల్

సూర్యాపేట జిల్లా బాలెంల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా శైలజ వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ.. ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులకు అమ్మానాన్నలా వ్యవహరించాల్సిన శైలజ దారి తప్పింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 6, 2024 / 05:47 PM IST

    Suryapet

    Follow us on

    Suryapet: విద్యార్థినులకు చదువు చెప్పి.. వారిని ఒక దారిలో పెట్టాల్సిన ప్రిన్సిపాల్ దారి తప్పింది. విద్యార్థినులకు రోల్ మోడల్ గా ఉండాల్సింది పోయి చెడు కార్యకలాపాలకు అలవాటు పడింది. అంతేకాదు వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఆ విద్యార్థినులు నిరసన చేపట్టారు. ఇలాంటి తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ రోడ్డుకెక్కారు.

    సూర్యాపేట జిల్లా బాలెంల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ గా శైలజ వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ.. ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులకు అమ్మానాన్నలా వ్యవహరించాల్సిన శైలజ దారి తప్పింది.. రాత్రి సమయంలో బీర్లు తాగుతూ కళాశాలను వైన్ షాప్ గా మార్చేసింది. బీర్లు మాత్రమే కాదు, అప్పుడప్పుడూ మద్యం తాగుతోందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.. పైగా వారిని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతోంది. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తోంది.. అసభ్యమైన పదజాలంతో దూషిస్తోంది. విద్యార్థినులు తమ తల్లిదండ్రులను తీసుకొచ్చినప్పటికీ ఆ ప్రిన్సిపాల్ వ్యవహార శైలి మారడం లేదు. పైగా బండ బూతులు తిడుతోంది. దీనికి తోడు కొద్దిరోజుల క్రితం ప్రిన్సిపాల్ శైలజ కుమారుడు హాస్టల్ కు వచ్చాడు. వారం పాటు అక్కడే ఉన్నాడు. ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థులను శైలజ ఇబ్బంది పెట్టింది. వాస్తవానికి వారం పాటు అతడు హాస్టల్లో ఉండడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నారు.

    మద్యం తాగిన మత్తులో శైలజ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ కళాశాలలో ఏసీటీగా వ్యవహరిస్తున్న మరో మహిళ ప్రిన్సిపాల్ శైలజకు అండగా ఉంటున్నదనే ఆరోపణలున్నాయి. అందువల్లే శైలజ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. వెంటనే ప్రిన్సిపల్ శైలజ, ఏసీటీ గా వ్యవహరిస్తున్న మరో మహిళను విధుల నుంచి సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.. “హాస్టల్లో కేర్ టేకర్, ప్రిన్సిపాల్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇద్దరు కలిసి బీర్లు తాగుతున్నారు. ఒక్కోసారి మద్యం కూడా సేవిస్తున్నారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు మా మీదకు కూడా వస్తున్నారని” విద్యార్థినులు వాపోతున్నారు.. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులకు ప్రిన్సిపాల్ దాచి ఉంచిన బీర్లను చూపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.