Portugal Vs France: రొనాల్డో కు నిరాశ.. కన్నీటిని దిగ మింగుకుంటూ.. వీడియో వైరల్

వాస్తవానికి మ్యాచ్ జరిగిన నిర్ణీత, అదనపు సమయాల్లో ఫ్రాన్స్ - పోర్చుగల్ గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ లో షూట్ ఔట్ అనివార్యమైంది. షూట్ ఔట్ లో ఎంబాపే ఆధ్వర్యంలోని ఫాన్స్ జట్టు దూకుడుగా ఆడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 6, 2024 5:41 pm

Portugal Vs France

Follow us on

Portugal Vs France: యూరో కప్ లో పోర్చుగల్ జట్టుకు నిరాశ మిగిలింది. తన సుదీర్ఘ కెరియర్లో చివరి యూరో కప్ టోర్నీ ఆడుతున్న రొనాల్డో.. పోర్చుగల్ జట్టును విజేతగా నిలపాలనుకున్నాడు. కానీ అతడి అంచనాలు తలకిందులయ్యాయి. క్వార్టర్ ఫైనల్ పోరులో పోర్చుగల్ ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది..షూట్ ఔట్ లో పోర్చుగల్ 3-5 తేడాతో ఫ్రాన్స్ ఎదుట తలవంచింది.

వాస్తవానికి మ్యాచ్ జరిగిన నిర్ణీత, అదనపు సమయాల్లో ఫ్రాన్స్ – పోర్చుగల్ గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ లో షూట్ ఔట్ అనివార్యమైంది. షూట్ ఔట్ లో ఎంబాపే ఆధ్వర్యంలోని ఫాన్స్ జట్టు దూకుడుగా ఆడింది. ఏకంగా ఐదు గోల్స్ చేసి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన నేపథ్యంలో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. తోటి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ మైదానాన్ని వీడాడు. పోర్చుగల్ లో కీలక ఆటగాడు వెపె రొనాల్డోను పట్టుకొని ఏడ్చాడు..రొనాల్డో కూడా కన్నీళ్లను తుడుచుకుంటూ వెపెను ఓదార్చాడు..రొనాల్డో.. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు ఇదే చివరి యూరో కప్ అని పేర్కొన్నాడు.. 2004లో తొలి యూరో కప్ ఆడిన రొనాల్డో.. మొత్తంగా ఆరుసార్లు ఈ మెగా టోర్నీలో పాలుపంచుకున్నాడు.

కాగా యూరో కప్ సెమీస్ లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో జర్మనీ పై స్పెయిన్ 2-1 తేడాతో గెలుపును దక్కించుకుంది. జర్మనీపై స్పెయిన్ కు అజేయ రికార్డు ఉంది. ఆ రికార్డును స్పెయిన్ కొనసాగించింది. అయితే జర్మనీ చివరి వరకు పోరాడింది.. ఎక్స్ట్రా టైం మరో మినిట్ లో ఎండ్ అవుతుందనగా 1-1 తో జర్మనీ, స్పెయిన్ సమానంగా ఉన్నాయి. ఒకానొక దశలో మ్యాచ్ షూట్ అవుట్ వైపు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఏ దశలో మైఖేల్ మెరీనో మైదానంలో వండర్ సృష్టించాడు.. 119 నిమిషంలో ఓల్మో అమల క్రాస్ హెడర్ అందించగా.. మెరీనో లిప్త పాటు కాలంలో గోల్ కొట్టేశాడు. ఫలితంగా స్పెయిన్ 2-1 తో లీడ్ లోకి వెళ్లి.. విజయం సాధించింది.