BJP
BJP: ఎట్టకేలకు దేశ రాజధాని న్యూఢిల్లీకి తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును బీజేపీ ప్రకటించింది. బుధవారం సాయంత్రం రాజధానిలో బీజేపీ లేజిస్లేటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును బీజేపీ అగ్రనాయకత్వం ప్రకటించింది. రేఖ గుప్తాను ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే రేఖాగుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే సీఎం సీటును జాక్ పాట్ గా కొట్టేశారు. ఆమె షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజక వర్గ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో బీజేపీ 27ఏళ్ల కలను సాకారం చేసుకుంది.
వాస్తవానికి బీజేపీలో సీఎంల ఎంపిక సాఫీగా కొనసాగుతుంది. ఎంత మంది సీనియర్లు సీఎం సీటు కోసం పోటీ పడినప్పటికీ వారందరినీ కూల్ చేసి.. ఆ పార్టీ పెద్దలైన మోదీ, అమిత్ షా ఎవరికి సీఎం పదవి అప్పగించాలని అనుకుంటారో వారికే అప్పగిస్తారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో రేఖా గుప్తాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రాజధాని ఢిల్లీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేను సీఎంగా బీజేపీ ప్రకటించడంతో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనించాయి. చాలా మంది సీనియర్ నేతలను కాదని ఈమెకు బీజేపీ అధిష్టానం ఇంత ప్రియారిటీ ఇచ్చిందో అని ఆలోచనలో పడ్డారు. ఎమ్మెల్యేగా కూడా రాజకీయ అనుభవం లేని మహిళను సీఎం స్థానంలో కూర్చోబెట్టడంలో బీజేపీ హైకమాండ్ ప్లాన్ ఏంటని అనుకుంటున్నారు. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.
ఢిల్లీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచినప్పటి నుంచి ఢిల్లీ సీఎం వీళ్లు అవుతారంటూ చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ బీజేపీ మొదటి నుంచే మహిళను సీఎం చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో బన్సూరీ స్వరాజ్, స్మృతీ ఇరానీ పేర్లు తెరమీదకు వచ్చాయి. కానీ అనూహ్యంగా రేఖా గుప్తా పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. సీఎం పదవి కోసం చాలా మంది వారసులు పోటీ పడ్డారు. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు సుష్మస్వరాజ్ కూతురు కూడా లైన్లో ఉన్నారు. కానీ వారందరినీ కాదని రేఖా గుప్తాను అవకాశం ఇచ్చారు.
అంతకు ముందు మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఊహించని పేర్లను ప్రకటించారు మోదీ, షా. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ ను సెలక్ట్ చేశారు. చౌహాన్ కు మధ్యప్రదేశ్ లో భారీ క్రేజ్ ఉంది. అయినా సరే ఆయనను కేంద్రానికే పరిమితం చేశారు. కొత్త నాయకత్వానికి అవకాశం అందించారు. రాజస్థాన్ లో వసుంధర రాజే వంటి వారు గట్టిగా ఒత్తిడి తెచ్చినప్పటికీ భజన్ లాల్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం ఇవ్వడానికి ఆయన సీఎంగా చేసి.. డిప్యూటీ సీఎంగా ఉండటానికి ఏ మాత్రం సంకోచించకపోవడమే కారణం. హర్యానాలో కూడా నాయబ్ సింగ్ సైనీకి అవకాశం కల్పించారు.
మోదీ, అమిత్ షాల వెనుక ఈ సెలక్షన్ పద్ధతి పార్టీ బలోపేతం కావాలి కానీ నాయకులకు వ్యక్తిగత ఇమేజ్ పెరగకూడదన్న కారణం ఉందని అనుకోవచ్చు. బీజేపీ ప్రస్తుత ముఖ్యమంత్రులంతా కూడా ఓ రకంగా పాపులారిటీ లేని వారే. ఒక్క ఆదిత్యనాథ్ మాత్రమే ప్రస్తుతం కాస్త ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి. పార్టీ కన్నా ఎక్కువగా ఏ నేత బీజేపీలో పాపులర్ కాకూడదన్నది బీజేపీ అగ్రనేతల వ్యూహం అని అంటున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: This is the strategy of modi and amit shah in selecting cms
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com