ABN Venkatakrishna: జర్నలిజం అనేది న్యూట్రల్ గా ఉండాలి. జర్నలిస్టులు స్థిరంగా ఉండాలి. అలాకాకుండా ఒక పక్షానికి కొమ్ముకాస్తూ ఉంటే దానిని జర్నలిజం అన్నారు. అలా వ్యవహరించే వారిని పాత్రికేయులు అని పిలవరు.
దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలలో నేడు జర్నలిజం అనేది డబ్బా కొట్టే వ్యవస్థ లాగా మారిపోయింది. జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే వ్యక్తులుగా దిగజారి పోయారు. తద్వారా జర్నలిజాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. మీడియా సంస్థలు ప్రసారం చేసే కథనాలను జనాలు విశ్వసించే అవకాశం లేకుండా పోయింది.
ఇలా పాత్రికేయం ఎంతవరకు దిగజారుతుంది? పాత్రికేయులు ఏ స్థాయిలో తమ విలువలను కోల్పోతారు? అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు కాలమే చెబుతోంది. ఇక మీడియా ఎంత దిగజారాలో అంత దిగజారిపోయింది. పాత్రికేయులు ఏ స్థాయి పడిపోవాలో ఆ స్థాయికి పడిపోయారు.. ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే.. అన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధంగా న్యూస్ ఛానల్.. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి.
ఇక పార్టీలకు వత్తాసు పలికే న్యూస్ చానల్స్ ప్రసారం చేసే కథనాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక విధంగా.. వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరో విధంగా కథనాలను ప్రసారం చేయడం ఆ న్యూస్ ఛానల్స్ అధిపతులకే చెల్లింది. జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే తెలంగాణలో భారత రాష్ట్రపతి ఒకడుగు ముందుకేసి.. నెత్తి మాసిన ప్రయత్నం చేసింది. ఈటీవీలో జబర్దస్త్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ మీద స్కిట్ లు రూపొందించింది. సహజంగానే రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద గులాబీ పార్టీ ఉడికిపోతుంది కాబట్టి.. ఇటీవల కేటీఆర్ కు, హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి.. ఆ పార్టీ వీర విధేయులు స్కిట్ లో రెచ్చిపోయారు.
రేవంత్ రెడ్డి ని తిట్టి పోశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను తీవ్రంగా విమర్శించారు. మంత్రులనూ వదిలిపెట్టలేదు. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఎవరూ హర్షించరు. పైగా జండా వందనం రోజు ఇలాంటి నేలబారు కార్యక్రమాలు చేయడాన్ని ఎవరూ ఒప్పుకోరు.
ఇది ఏబీఎన్ ఛానల్ కు తప్పు లాగా అనిపించింది. ఏకంగా ఒక డిబేట్ కూడా పెట్టింది. ఈ డిబేట్లో ఏబీఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మీద ఇదే తీరుగా స్కిట్ లు చేశారు. వాటిని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విరగబడి నవ్వారు. అప్పుడు ఇదే ఏబీఎన్ ప్రజాస్వామ్యం సాధించిన విజయం గా చెప్పుకుంది. కానీ, తెలంగాణలో గులాబీ పార్టీ కాంగ్రెస్ మీద స్కిట్ లు చేస్తే శోకాలు పెట్టింది. సరిగ్గా ఇదే విషయాన్ని వైసిపి సోషల్ మీడియా బయటపెట్టింది. ఏపీలో చేస్తే ఆనందం లాగా.. తెలంగాణలో చేస్తే విచారంలాగా అనిపించడం నిజంగా శోచనీయమని వైసిపి నాయకులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.