HomeతెలంగాణPinnelli Ramakrishna Reddy: మాచర్లలో అరాచకం వెనుక పిన్నెల్లి.. వైరల్ వీడియో బయటపడిందిలా

Pinnelli Ramakrishna Reddy: మాచర్లలో అరాచకం వెనుక పిన్నెల్లి.. వైరల్ వీడియో బయటపడిందిలా

Pinnelli Ramakrishna Reddy: దొంగే దొంగ అన్నట్టు ఉంది వైసీపీ నేతల పరిస్థితి. పోలింగ్ నాడు జరిగిన విధ్వంసాలు ఇప్పుడు బయటకు వస్తుండడంతో.. వైసీపీ నేతల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. మాచర్లలో పోలింగ్ నాడు విధ్వంసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈవీఎంల ధ్వంసం, టిడిపి ఏజెంట్ తల పగలడం వెనుక గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నాడు పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేసిన సిసి ఫుటేజ్ బయటపడడంతో.. ఈ విధ్వంసానికి పాల్పడింది వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావడం ఆందోళన కలిగిస్తోంది.

అసలు మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ఎంపీపీ జడ్పిటిసి ఎన్నికలు ఏకగ్రీవంగాయి. మాచర్ల మున్సిపాలిటీలో అయితే ఒక్క వార్డు కూడా సక్రమంగా ఎన్నిక జరగలేదు. చివరకు టిడిపి నేతల వాహనాలపై ఏ తరహాలో దాడులు జరిగాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే మాదిరిగా ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యే పిన్నెల్లితో పాటు వైసీపీ నేతలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. ఎన్నికలకు ముందు భారీగా అధికారులను మార్చారు. దీంతో ఇది వైసిపి నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే దాడులకు దిగినట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు మాచర్లలో అధికారులు మారారు. ఇలా మారిన చోట మాత్రమే విధ్వంసాలు జరిగాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కేవలం అధికారులను మార్చి రిగ్గింగ్ కు పాల్పడేందుకే ఈ తరహా చర్యలకు దిగారని వారి అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సాక్షాత్ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే.. పోలింగ్ కేంద్రంలోకి దూరి.. ఈవీఎంలను నేలకేసి కొట్టి.. అడ్డుకున్న టిడిపి ఏజెంట్ తల పగలగొట్టడం స్పష్టంగా సిసి ఫుటేజ్ లో కనిపిస్తోంది. బహుశా ఈ వీడియోలు బయటపడతాయని.. ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొత్తం మాచర్ల అట్టుడికి పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికారుల మార్పిడితో.. టిడిపి కూటమి ఈ పని చేయించిందన్న ఆరోపణలు వైసీపీ నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు సిసి ఫుటేజ్ బయటపడేసరికి వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular