తెలుగు మీడియా హౌజ్‌లోకి మరో చానల్‌

కరోనా ప్రవాహంలో కొట్టుకుపోయిన బాధితుల్లో మీడియా కూడా ఒకటి.   కరోనా ధాటికి మీడియా భారీగా దెబ్బతింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ కొత్త పేపర్‌‌ పెట్టడానికి అయితే సాహసించరు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పేపర్లే చాలావరకు ఖర్చు తగ్గించుకున్నాయి. చాలా మంది స్టాఫ్‌నీ తీసేశాయి. ఏ పత్రిక అయినా ఏదో ఒక పార్టీకి తోకలా పనిచేయడం తప్ప.. సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అసలిప్పుడు పత్రికలు ఔట్‌ డేటెడ్‌ అనే చెప్పాలి. ఇప్పుడు నడుస్తున్నదంతా వెబ్‌ సామ్రాజ్యం […]

Written By: NARESH, Updated On : September 12, 2020 9:34 am

News channel

Follow us on


కరోనా ప్రవాహంలో కొట్టుకుపోయిన బాధితుల్లో మీడియా కూడా ఒకటి.   కరోనా ధాటికి మీడియా భారీగా దెబ్బతింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ కొత్త పేపర్‌‌ పెట్టడానికి అయితే సాహసించరు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పేపర్లే చాలావరకు ఖర్చు తగ్గించుకున్నాయి. చాలా మంది స్టాఫ్‌నీ తీసేశాయి. ఏ పత్రిక అయినా ఏదో ఒక పార్టీకి తోకలా పనిచేయడం తప్ప.. సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అసలిప్పుడు పత్రికలు ఔట్‌ డేటెడ్‌ అనే చెప్పాలి. ఇప్పుడు నడుస్తున్నదంతా వెబ్‌ సామ్రాజ్యం అని అందరికీ తెలిసిందే. టీవీల కన్నా ఫాస్ట్‌గా క్షణాల్లో వార్తలను ఫోన్లకు చేరవేస్తున్నారు.

Also Read: తెలంగాణలో నూతన శకం ఆరంభం

పేపర్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక చానళ్లలో రెండు మూడింటి మధ్య పోటీ బాగానే కనిపిస్తోంది. మిగతావి అంతలా పోటీలో నిలవడం లేదు. చిన్నచిన్న చానళ్లయితే చస్తూబతుకుతున్నాయి. నాలుగురోజులైతే ఎప్పుడు ఆరిపోతాయో కూడా తెలియదు. పెద్దపెద్ద చానల్స్‌ కూడా ఇతర భాషల్లో ఉన్న తమ చానళ్లను ఇప్పటికే వదులుకున్నాయి. కానీ.. ఇప్పుడు కొత్తగా ఓ వార్త తెరమీదకు వచ్చింది. తెలుగు తెరపై మరో చానల్‌ ప్రసారం కాబోతోందని తెలుస్తోంది.

కాషాయ మీడియా సంస్థగా పేరొందిన రిపబ్లిక్‌ టీవీ వచ్చే మార్చి ఆఖరుకల్లా ఆరు ఇతర భాషల్లోనూ చానల్స్‌ ప్రారంభించాలని ప్లాన్‌ చేసింది. రిపబ్లిక్‌ టీవీ ఎండీ, ఎడిటర్‌‌ ఆర్నబ్‌ గోస్వామి స్వయంగా ఇండియన్‌టెలివిజన్‌.కామ్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయానా వెల్లడించాడు. అయితే అందులో తెలుగు కూడా ఉందని అప్పుడే టాక్‌ నడుస్తోంది.

Also Read: బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత

ఎందుకంటే ఇప్పటివరకు అటు ఏపీలో కానీ.. ఇటు తెలంగాణలో కానీ కాషాయం చానల్స్‌ ఏమీ లేవు. వచ్చే ఎలక్షన్ల నాటికి రెండు రాష్ట్రాల్లోనూ స్ట్రాంగ్‌ కావాలనుకుంటున్న బీజేపీ ఈ చానల్‌ సపోర్టు ఎంతగానో అవసరం ఉంది. ఆల్‌రెడీ రిపబ్లిక్‌ టీవీ టీఆర్పీలో ఇప్పటికే నెంబర్‌‌ వన్‌. టైమ్స్‌ నౌ చానెల్‌ను ఇది ఎప్పుడో దాటేసింది. హిందీలోనూ ప్రారంభించి రెండు వారాల్లోనే ఆజ్‌ తక్‌ చానల్‌ను దాటేసింది. ఇప్పుడు హిందీ మార్కెట్‌లోనూ నంబర్‌‌ స్థానంలో నిలిచింది. ఇక రేపు తెలుగులోనూ ప్రారంభిస్తే ఆ స్థాయి టీఆర్పీ సాధిస్తుందనే నమ్మకం బీజేపీలో కనిపిస్తోంది. అదే నిజమైతే ఇక బీజేపీకి ఎదురువెళ్లేది ఎవరు..?