Also Read: బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత
కిందటి ఎన్నికల్లో జగన్ ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ ఏపీలో మద్యషాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. జగన్ ఏడాది పాలనలోనే ఏపీలో బెల్టుషాపుల ఎత్తివేత.. మద్యం రేట్ల పెంపు.. మద్యం షాపులను తగ్గిస్తూ వెళుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఏపీలో సంపూర్ణ మద్యనిషేధం చేయాలని జగన్ భావిస్తున్నారు.
ఏపీ ప్రస్తుతం అప్పుల ఊబిలో కురుకుపోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే యేటా వేలకోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయం పూర్తిగా పడిపోయింది. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా కొంతకాలంగా అరకొరగా నిధులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీకి ఆదాయం వచ్చే రాజధాని లేకపోగా మూడు రాజధానుల నిర్మాణం కోసం వేలకోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కరోనా పరిస్థితుల్లోనూ జగన్ సర్కార్ ను కేవలం మద్యం దుకాణాలే. మద్యం రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతుండటంతో ఆదాయం మొత్తం ఖజానాకే చేరుతోంది. అయితే జగన్ సర్కార్ మద్యం నిషేధం అమలు చేస్తే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం ఏపీలో కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అంచనాలు కూడా పూర్తిగా తప్పినట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీ హిందుత్వంపై చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా…?
దీంతో రానున్న రోజుల్లో మద్యం నిషేధం అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని అధికారులే చర్చించుకుంటున్నారు. ఏపీ పరిస్థితులను, ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకొని జగన్ సైతం ఈ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిందేనని టాక్ విన్పిస్తోంది. అయితే సీఎం జగన్ సంపూర్ణ మద్యం నిషేధంపై మొండిగా ముందుకెళుతారా? లేదా అనేది వేచిచూడాల్సిందే..!