వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ లో ఇటీవల సీనియర్లు అంతా అసమ్మతి రాజేశారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీని ప్రక్షాళన చేసేశారు. పార్టీ వర్కింగ్ కమిటీ, సంస్థాగత పదవుల్లో చాలా మందిని తీసేశారు. పలువురిని తీసుకున్నారు.
Also Read: మాఫియా డాన్ దావూద్ గ్యాంగ్ తో అక్షయ్ కు సంబంధాలు?
కాంగ్రెస్ లోని కోవర్టులను, వృద్ధ జంబూకాలను తీసివేయాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీకి సర్వాధికారాలు కట్టబెట్టేలా ‘రాహుల్ గాంధీ టీం’నే పార్టీలోకి తీసుకున్నారు. పెద్ద పీట వేశారు. ఇక పార్టీపై పట్టును కోల్పోకుండా సోనియా తనకు నమ్మదగిన నేతలకే పెద్దపీట వేశారు.
నిరసన గళం వినిపించి సీనియర్లు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి లేఖ రాసిన గులాంనబీ ఆజాద్ ను సోనియా పక్కనపెట్టడం సంచలనమైంది. దీన్ని బట్టి నిరసనగళం వినిపిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇక నుంచి ఆరుగురు సభ్యులతో సోనియా ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీయే కాంగ్రెస్ ను పాలిస్తుంది. వారి సలహాల ప్రకారమే సోనియా ముందుకెళుతుంది. దీన్నే రాహుల్ గాంధీ టీంగా అభివర్ణిస్తున్నారు. ఈ కమిటీలో అంటోనీ, అహ్మద్ పటేల్, అంబికాసోనీ, వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా లతో అత్యున్నత కమిటీని సోనియా ఏర్పాటు చేశారు.ఈ ఆరుగురే సోనియా ప్రాధాన్యత ఇస్తారని తేటతెల్లమైపోయింది.
Also Read: బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత
ఇక యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంకను ఉత్తరప్రదేశ్ ఇన్ చార్జిని చేశారు. దీన్ని బట్టి ఇక సోనియా కాంగ్రెస్ లో మరోసారి యాక్టివ్ రోల్ పోషించబోతోందని.. రాహుల్ కోరినట్టే ఆయన అనుకూల టీం ఏర్పాటు చేసినట్టు అర్థమవుతోంది.