Andhra Jyothy Sensational Article on Kavitha : ఇటీవల కాలంలో మనదేశంలో ఎన్నో ఇష్యూస్ ఉన్నప్పటికీ.. ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన వార్తలకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చి.. కేవలం గులాబీ అధినేత కుమార్తె ఇష్యూ మీదనే ఫోకస్ చేశాడు రాధాకృష్ణ. ఆమె సెంట్రిక్ పాయింట్ గా తన పత్రికలో బ్యానర్ స్టోరీస్ పబ్లిష్ చేశాడు. ఒకరకంగా పోటీపత్రికలతో పోల్చి చూస్తే బొంబాట్ స్టోరీస్ పబ్లిష్ చేసి ఒక రకంగా విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన బూస్టప్ ఇచ్చాడు. కాంగ్రెస్ నేతల వల్ల కానిది.. తను చేసే నిరూపించాడు రాధాకృష్ణ. ఒక రకంగా కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణకి రుణపడి ఉండాలి. కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ లో మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు రాధాకృష్ణ.
Also Read : మోదీ బహుముఖ వ్యూహం: పహల్గామ్ దాడి తర్వాత భారత్ దౌత్య విజయం!!
ఇటీవల తన పత్రికలో స్టోరీస్ పబ్లిష్ చేసినప్పుడు కల్వకుంట్ల కవిత నేరుగానే రియాక్ట్ అయింది. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫేక్ న్యూస్ అంటూ మండిపడింది.. ఇటీవల మీడియా చిట్ చాట్ లో కూడా చిల్లర వ్యక్తులతో.. కిరాయి ప్రచారాలు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడింది. అయితే నేరుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పేరును ప్రస్తావించకుండా కల్వకుంట్ల కవిత ఆ విమర్శలు చేయడం విశేషం.. కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై ఓ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తనకు, తన తండ్రికి దూరం పెరిగిందనే వార్తలు వార్తలు వస్తున్న క్రమంలో కల్వకుంట్ల కవిత ఒక్కసారిగా తన స్టాండ్ మార్చారు. తన తండ్రికి కాలేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. ఏ ధర్నా చౌక్ ను అయితే తమ ప్రభుత్వంలో ఎత్తివేశారో.. అదే ప్రాంతంలో బుధవారం ధర్నా చేశారు. ఆ ధర్నాలో కేవలం జాగృతి నాయకులు, కల్వకుంట్ల కవిత అనుచరులు మాత్రమే పాల్గొన్నారు. ఇందులో పాల్గొనకూడదని గులాబీ కార్యకర్తలకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.
ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి కల్వకుంట్ల కవిత పై మరో నెగిటివ్ కథనాన్ని ప్రచురించింది. కాకపోతే ఈసారి బ్యానర్ స్థాయిలో స్టోరీ పబ్లిష్ చేయకుండా.. లోపలి పేజీలకు పరిమితం చేసింది.. కల్వకుంట్ల కవితపై గులాబీ సుప్రీం కోపంగా ఉన్నారని.. ఇంతవరకు ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. గతంలో ఆమె వద్దకు దామోదర్ రావు, గండ్ర రామ్మోహన్ రావు వారంతట వారుగానే వెళ్లారని.. వారు కేసీఆర్ పంపితే వెళ్లలేదని.. స్వయంగా కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లారని రాధాకృష్ణ బాంబు పేల్చాడు. అంటే ఈ లెక్కన కల్వకుంట్ల కవితను గులాబీ సుప్రీం క్షమించలేదని.. ఆమెతో మాట్లాడటం లేదని.. దూరం పెట్టాడని రాధాకృష్ణ రాసుకొచ్చాడు.. మరి ఇంతటి సమాచారం మిగతా పేపర్లకు ఎందుకు తెలియడం లేదు? ఆ పేపర్లలో ఎందుకు రావడం లేదు? కల్వకుంట్ల కవిత ఆరోపించినట్టు ఇవన్నీ కిరాయి రాతలేనా? ఫేక్ ప్రచారాలేనా? గతంలో షర్మిలపై రాధాకృష్ణ ఇలానే రాసినప్పుడు చాలామంది విమర్శించారు. ఆ తర్వాత షర్మిల అన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టింది. అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. అంటే తెలంగాణలో కూడా కల్వకుంట్ల కవిత షర్మిల పాత్ర పోషిస్తుందా? మరో షర్మిల అవుతుందా? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.