Justice PC Ghosh: కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపటి నుంచి మాజీ మంత్రులు , ఆ తర్వాత మాజీ సీఎం ను విచారించనున్నారు. రేపు ఈటల రాజేందర్, సోమవారం హరీశ్ రావు, బుధవారం కేసీఆర్ ను విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన అన్ని అంశాలపైనా వారిని ప్రశ్నించినున్నట్లు తెలుస్తోంది.