Principal Salutes The Feet Of The Student: సాధారణంగా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విద్యార్థులు నమస్కారం చేస్తారు. కానీ దురద్రుష్టం అక్కడ మాత్రం విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్ అయిన మహిళ నమస్కారం చేయాల్సి వచ్చంది. కాళ్లకు నమస్కారం పెట్టాల్సి వచ్చంది. దీనికి కారణం వారి కోపాన్ని తగ్గించడానికేనని తెలుస్తుండడం బాధాకరం. వయసులో పెద్ద, అందులోనూ ఒక మహిళా అధ్యాపకురాలు అంతగా వేడుకుంటున్నా సదరు విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? విద్యార్థి కాళ్లు పట్టుకుని క్షమించమనేంత పెద్ద తప్పు ఆమె ఏం చేసింది? నెటిజన్లు కోపానికి కారణం ఏంటనే పూర్తి వివరాలను ఓ సారి పరిశీలిస్తే..అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో సదరు విద్యార్థిని హాజరుశాతం తక్కువగా ఉందనే విషయం అధ్యాపకుల దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను హెచ్చరించారు. అయితే ఆ విషయాన్ని విద్యార్థిని స్థానిక ఏబీవీపీ నాయకుల ద్రుష్టికి తీసుకెళ్లింది. అంతే విద్యార్థినికే ఇబ్బందిపెడతారా? అంటూ స్థానిక ఏబీవీపీ నాయకుడు అక్షత్ జైస్వాల్ తెగ రెచ్చిపోయాడు.
Also Read: AP Government Debits: కుప్పలు తెప్పలుగా అప్పు..మరో రూ.2000 కోట్ల రుణానికి ఏపీ సర్కారు ప్రయత్నం
సదరు విద్యార్థిని వెంట పెట్టుకుని నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి జైస్వాల్ వెళ్లాడు. అనంతరం ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సదరు మహిళా ప్రిన్సిపల్.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తప్పగకపోవడంతో.. చేతులు జోడించి మరీ సదరు విద్యార్థిని క్షమాపణలు కోరారు. అంతేకాకుండా కాళ్లకు కూడా నమస్కారం చేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఏబీవీపీ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ స్థానిక ఏబీవీపీ నాయకులు ప్రకటన విడుదల చేశారు.