Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం పాకిస్తానీ అమ్మాయిగా ...

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం పాకిస్తానీ అమ్మాయిగా పూజా హెగ్డే !

Vijay Devarakonda: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక కొత్త సినిమా ‘జనగణమన’ మొదలైన సంగతి తెలిసిందే. కాగా కాశ్మీర్ నేపథ్యంగా ఈ సినిమాని తీస్తున్నాడు పూరి. అంటే, సినిమా మొత్తం కాశ్మీర్ లో ఉండదు. కొంత భాగం అక్కడ ఉంటుంది. ఇక ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని.. విజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. కథలో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే.. కాశ్మీర్ లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడట హీరో.

Vijay Devarakonda
Puri, Vijay

అయితే.. ఆ యువతి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రలో పూజా హెగ్డేను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే ఇంతకుముందే విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సింది. అదే లైగర్. కానీ ఆ సినిమా మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరూ లవర్స్ గా నటిస్తున్నారు. మరి, విజయ్ – పూజా కాంబినేషన్‌ పై మీ అభిప్రాయాన్ని కింద మీ కామెంట్స్ రూపంలో తెలపండి.

Also Read: Principal Salutes The Feet Of The Student: విద్యార్థుల కాళ్లకు ప్రిన్సిపాల్ నమస్కారం.. అసలు జరిగిందేమిటంటే?

ఇక మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు విజయ్ దేవరకొండ. అన్నట్లు, పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కలయికలో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ లుక్ చాలా వైల్డ్ గా ఉంటుందట. మధ్యలో మిలిటరీ కటింగ్ తోనే విజయ్ దేవరకొండ కనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడట.

Vijay Devarakonda
Pooja Hegde

ఇక ఇప్పటికే ఈ ‘జనగణమన’ నుంచి వచ్చిన ఫస్ట్ మోషన్ పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్ వ్యూ అండ్ కలర్ టోన్ అండ్ మూవీ కాన్సెప్ట్ తాలూకు విజువల్ సెన్స్ బాగున్నాయి. పైగా భయంకరమైన యుద్ధ వాతావరణంలో శత్రువులను అంతమొందించేందుకు నింగి నుంచి భారత సైనికులు నేలకు దూకుతున్న దృశ్యాలతో తొలి పోస్టర్ ను డిజైన్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ప్రస్తుతానికి అయితే.. విజయ్ – పూరి ‘లైగర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు. ఈ ‘లైగర్’ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Also Read: NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

బిందు మాధవి సక్సెస్‌ సీక్రెట్స్‌ ఇదే..! || Bindu Madhavi Success Secrete || Big Boss Non Stop

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version