Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya Thank You: జూలై 8న 'థాంక్యూ'.. చైతు కొత్తగా ట్రై...

Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !

Naga Chaitanya Thank You: వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. జూలై 8వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ లో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడు. చైతు పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

Naga Chaitanya Thank You
Naga Chaitanya

ఇక చైతు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వస్తాడని.. ఈ జర్నీలో గొప్ప సెంటిమెంట్ తో సాగే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం నేపథ్యం చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందట. నిజానికి ఈ సినిమా కథ గురించి మరో రూమర్ కూడా బాగా వినిపిస్తోంది.

Also Read: Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పు దేనికి సంకేతం?

ఓ మధ్యతరగతి అబ్బాయి ఎన్నో కష్టాలు పడి.. ఇంటర్ నేషనల్ గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అపజయాలు పొందాడు అనే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయట. అదేవిధంగా తన విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.

Naga Chaitanya Thank You
Chay

మొత్తమ్మీద ఈ క్రమంలో చైతు పాత్ర ఎలాంటి అనుభవాలు పొందాడు, అలాగే ఎలాంటి ఎమోషన్స్ జనరేట్ చేస్తాడు ? చివరకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే పాయింట్స్ మీద సినిమా ఎండింగ్ ఉంటుందట. మరి చూడాలి, పై రెండు పాయింట్స్ లో ఈ సినిమా ఏ పాయింట్ కి సంబంధించి ఉంటుందో. ఒక్కటి అయితే నిజం.. ఈ సినిమాలో చైతు చాలా కొత్తగా కనిపిస్తాడట.

Also Read: Allu Arjun Navadeep: బన్నీ సర్‌ప్రైజ్‌ : హీరో నవదీప్‌కు సూపర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌..

బిందు మాధవి సక్సెస్‌ సీక్రెట్స్‌ ఇదే..! || Bindu Madhavi Success Secrete || Big Boss Non Stop

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version