Sri Chaitanya School incident: సమాజంలో గురువుకు ఉన్నతమైన స్థానం ఉంది. గురువు లేని విద్య వ్యర్థం. మనం ఏం నేర్చుకున్నా గురువు ఉండాలి. ఇక చదువు విషయంలో తప్పనిసరి. గురువే భవిష్యత్‌కు బాటలు వేసేది. అందుకే టెక్నాలజీ ఎంత పెరిగినా గురువుల గౌరవం తగ్గడం లేదు. కానీ, కొందరు ‘టీ’చకుల కారణంగా గురువుల గౌరవం మంటగలుస్తోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన బడిలో కామాంధులుగా మారుతున్నారు. అమ్మాయిలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. లైంగికదాడులు చేస్తున్నారు. తాజాగా ఓ కార్పొరేట్ పాఠశాలలో మరో టీచకుడి బాగోతం బట్టబయలైది.
మాయ మాటలతో పెళ్లిళ్లు..
హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధాయయుడు పర్రె మైటీన్ పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు.
తండ్రి ఫిర్యాదుతో కేసు..
విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. టీచకుడు పర్రె మైటీస్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన 20 రోజుల క్రితం జరిగింది. పాఠశాల యాజమాన్యం విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచింది. తాజాగా టీచకుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది.
విద్యార్థినుల భద్రతపై ఆందోళన..
ఈ ఘటన పాఠశాలల్లో మానిటరింగ్ లోపాలను బహిర్గతం చేసింది. గురువగా భావిస్తున్న ఉపాధ్యాలు.. విద్యార్థినుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు, యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తల్లిదండ్రులు కూడా విద్యార్థినుల ప్రవర్తనలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
శ్రీ చైతన్యలో కీచక టీచర్
పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు
విద్యార్థినిని ఉపాధ్యాయుడు పర్రే మైటీన్ ట్రాప్ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు
విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించి షాక్ తిన్న తల్లిదండ్రులు
విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై… pic.twitter.com/0bDGaSkv7z
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2026