Ponguleti Srinivas Reddy: అభివృద్ధి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉండాలని చాలామంది నాయకులు చెబుతూ ఉంటారు. ఇరువురి సమన్వయంతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అంటూ ఉంటారు. అయినా ఒక్కోసారి అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హై క్యాడర్ కు చెందిన అధికారులు.. అత్యున్నత పదవిలో ఉన్న నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్న సంఘటనలు ఇప్పటికే చాలా వరకు బయటకు వచ్చాయి. తాజాగా కరీంనగర్ లో జరిగిన ఓ సంఘటన సంచలనం రేపింది. ఇక్కడి కలెక్టర్ పమేలా సత్పతి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పోలీసులపై అసహనం వ్యక్తం చేసిన క్రమంలో మంత్రి కలెక్టర్ పై కూడాఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా కలెక్టర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందించా.రు ఈ సందర్భంగా ఆమె ఎలాంటి మెసేజ్ పెట్టారంటే..?
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జనవరి 24వ తేదీన కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇందులో బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. అయితే కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పూర్తయిన సందర్భంగా కొన్నింటిని ప్రారంభించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై పోలీసులు తోసుకు రావడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ తో మాట్లాడుతూ ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ గన్మెన్ పొంగులేటి శ్రీనివాసు రెడ్డికి సారీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే ఆయన పోలీస్ కమిషనర్ ఎక్కడ..? అని అన్నారు.
అయితే తాజాగా ఈ సంఘటనపై కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె Instragram ఖాతా ద్వారా I’ am a women of season, I burn, I bloom, I strike, I turn to eyes’ అనే మెసేజ్ ను ఉంచారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారా..? లేదా..? అనేది తెలియదు. కానీ ఈ మెసేజ్ తో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు, ప్రజా ప్రతినిధుల మధ్య ఇప్పటికే చాలా వరకు వివాదాలు ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత ఉన్నతాధికారుల చొరవతో సద్దుమనిగాయి. గతంలోనూ కరీంనగర్ కలెక్టర్గా సర్పరాజ్ అహ్మద్ ఉన్న సమయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో వాగ్వాదం జరిగింది. తాజాగా కలెక్టర్ పమేలా సత్పతితో తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి. ఈ సందర్భంగా ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందని కొందరు అంటుండగా చర్చించుకుంటున్నారు.
నిన్న కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై మంత్రి పొంగులేటి తీవ్ర అసహనం
Instagram లో కలెక్టర్ పమేలా సత్పతి ఆసక్తికర స్టోరీ https://t.co/vj6wpG3t5Z pic.twitter.com/W0qLAr7inP
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2025