Rashmika Mandanna: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్, పాపులారిటీ ని తెచ్చుకొని పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ హీరోయిన్స్ గా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిలో రష్మిక మందన. కన్నడ లో ‘కిరాక్ పార్టీ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత టాలీవుడ్ లో ‘ఛలో’ అనే చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమై తొలిసినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘గీత గోవిందం’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. హిట్టు మీద హిట్టు కొడుతూ నిర్మాతలు, హీరోల పాలిట లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక పుష్ప సిరీస్ తో ఆమె పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ కి వెళ్లిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సికందర్’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రష్మిక కాలికి బలమైన దెబ్బ తగిలింది. అప్పటి నుండి ఆమె సరిగా నడవలేకపోతుంది. రీసెంట్ గానే ఆమె ముంబై లో ‘చావా’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో ఆమె ఒంటికాళ్లతో కుంటుకుంటూ నడవడం అందరినీ షాక్ కి గురి చేసింది. మూవీ టీం ని అతి కష్టం మీద ఆమెని స్టేజి మీదకు తీసుకొని రావాల్సి వచ్చింది. అదే విధంగా విమానాశ్రయం లో ఆమె కారు దిగగానే, వీల్ చైర్ ఎక్కి వెళ్లడం వంటి వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తన కాలికి తగిలిన దెబ్బ గురించి ఇంస్టాగ్రామ్ లో రీసెంట్ గానే ఒక పోస్ట్ పెట్టింది.
ఆమె మాట్లాడుతూ ‘నా కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయ్యింది. కండరాల్లో చీలిక కూడా ఏర్పడింది. రెండు వారాలుగా కనీసం నడవలేని పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్లిన ఒంటికాలి మీద, లేకపోతే వీల్ చైర్ సహాయం తోనే వెళ్తున్నాను. ఈ కష్టసమయం లో మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వల్ల నాకు ఆ నొప్పి తెలియడం లేదు. నాకు అండగా, మద్దతుగా నిలబడిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీ లో ‘చావా’, ‘సికిందర్’ సినిమాలు చేస్తుండగా, తెలుగు లో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని చేస్తుంది. పుష్ప 2 , ఎనిమల్ వంటి సంచలనాత్మక చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమెకు, పాన్ ఇండియా లెవెల్లోనే అవకాశాలు లభిస్తున్నాయి. ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ కి వెళ్ళిపోతుందని ఆమె అభిమానులు కూడా ఊహించలేదు.