AP BJP: ఏపీ( Andhra Pradesh) విషయంలో బిజెపి మైండ్ గేమ్ ఆడుతోందా? వైసిపి నిర్వీర్యం వెనుక బిజెపికి లాభం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పక్షం వైసిపి. ఇది కాదనలేని సత్యం. కానీ వైసీపీ నిర్వీర్యం అయితే లాభం టిడిపికి రావాలి. లేకుంటే జనసేన దానిని క్యాచ్ చేసుకోవాలి. కానీ బిజెపి క్యాష్ చేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాలను సైతం వదులుకున్నారు. వ్యక్తిగత కారణాలు చెబుతూ వారు రాజీనామా చేయడంతో వెంటనే రాజ్యసభ చైర్మన్ రాజీనామా చేశారు. దీంతో వారి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. అటు తరువాత జనసేన కొనసాగుతోంది. కానీ మూడో స్థానంలో ఉన్న బిజెపి ఒక రాజ్యసభ పదవి తీసుకుంది. అంటే బిజెపి తన బలం పెంచుకున్న మాట వాస్తవమే కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న సాయి రెడ్డి ఏకంగా పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనం రేకెత్తించింది. అయితే ఖాళీ అయిన ఈ స్థానంపై కూడా బిజెపి కన్నేసినట్లు తెలుస్తోంది.
* అనేక వ్యూహాలు
విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy)రాజీనామా వెనుక అనేక రకాల వ్యూహాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వైసీపీలో ప్రాధాన్యం తగ్గడం వల్లే విజయసాయి రాజీనామా చేశారన్న విశ్లేషణ ఉంది. అయితే అదే సమయంలో జగన్ తెర వెనుక ఉండి విజయసాయిరెడ్డి తో రాజీనామా చేయించారన్న కామెంట్ కూడా ఉంది. అయితే అదే జరిగితే ఆయన రాజ్యసభ పదవి వదులుకోరు కదా. నేరుగా పదవితో పాటు బిజెపిలో చేరేవారు కదా. కానీ బిజెపి వ్యూహం అది కాదు. వైసీపీని నిర్వీర్యం చేసి.. తమ బలం పెంచుకోవాలన్నది వారి ప్లాన్. అందులో భాగంగానే రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీల ద్వారా రాజీనామా చేయించి.. పదవులు తీసుకోవాలన్నది వారి ప్లాన్. ఈ విషయంలో జనసేన సైతం బిజెపికి సహకరిస్తోంది. తెలుగుదేశం పార్టీది ఒప్పుకోక తప్పని పరిస్థితి.
* జనసేన త్యాగం
మొన్న మూడు రాజ్యసభ( Rajya Sabha ) సీట్లకు ఎన్నికలు జరిగాయి. అయితే చివరి నిమిషం వరకు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బిజెపి అగ్ర నేతలు ఎంటర్ అయ్యారు. తమకు ఒక సీటు కేటాయించాలని కోరారు. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా టిడిపి రెండు సీట్లను తీసుకుంది. ఒక సీటు జనసేనకు కేటాయించింది. అప్పుడే బిజెపి అగ్ర నేతలు పవన్ కు విన్నపం పంపారు. మారు మాట ఆడకుండా పవన్ సైతం సైడ్ అయ్యారు. బిజెపికి లైన్ క్లియర్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. సీటు కోల్పోయింది వైసీపీ. దక్కింది బిజెపికి. అంటే బిజెపి బలం పెరగడానికి పవన్ కూడా దోహదపడుతున్నట్లు అర్థమవుతోంది.
* రాజీనామా వెనుక బిజెపికి ప్రయోజనం
వైసిపిలో( YSR Congress ) పదవులకు రాజీనామా చేసిన నేతలు.. ఏ పార్టీలో చేరుతారో అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రతి రాజీనామా వెనుక బిజెపి ప్రయోజనం పొందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. నేతల రాజీనామాతో వైసిపి బలం పడిపోతుండగా.. బిజెపి బలం క్రమేపి పెంచుకుంటుంది. అయితే ఈ విషయంలో టిడిపికి నిస్సహాయత తప్పదు. మరోవైపు జనసేన తన వంతు సహకారం కూడా అందిస్తోంది. మొత్తానికి అయితే వైసిపి ఎంత పతనం అయితే.. బిజెపికి అంత లాభం అన్నమాట.