https://oktelugu.com/

Telangana: అమ్మాయితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ప్రముఖ సోషల్ మీడియా ఉద్యమకారుడు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పడిపోవడానికి యూట్యూబ్‌ ఛానెళ్లు కూడా తమవంతు పాత్ర పోషించాయి. అందులో ఈయన పెట్టింది కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 17, 2024 12:38 pm
    Telangana

    Telangana

    Follow us on

    Telangana: తెలంగాణలో గత ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో.. ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా యుద్ధం సాగించిన జర్నలిస్టుల్లో కొద్ది మంత్రికి మాత్రమే గుర్తింపు వచ్చింది. అందులో ఒకరు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి హీరోగా నిలిచారు. పక్కా ఆధారాలతో కథనాలు ప్రసారం చేస్తే లక్షల వ్యూస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఆయనపై పలు కేసులు పెట్టింది. అయితే ఆయనను నడిరోడ్డు మీద పండ్లు కొంటున్నప్పుడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం.. పోలీస్ స్టేషన్లు తిప్పి వేధించడంతో ఆయన పోరాటంతో తెలంగాణలో ఫేమస్ అయ్యారు.. ప్రముఖ న్యూస్ చానెల్ నడిపిన మాజీ సీఈవో ఆధ్వర్యంలో పనిచేసిన ఆయన తర్వాత అతనితో విభేదాలు రావడంతో బయటకు వచ్చేశాడు. అనంతరం ఒక యూట్యూబ్ చానెల్ పెట్టుకున్నాడు.

    – అమ్మాయితో అడ్డంగా..
    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పడిపోవడానికి యూట్యూబ్‌ ఛానెళ్లు కూడా తమవంతు పాత్ర పోషించాయి. అందులో ఈయన పెట్టింది కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో తమ అనుకూల ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నారు బీఆర్‌ఎస్‌ బాధిత జర్నలిస్టులు.. తమకు ఇబ్బందులు ఉండవని, తాము ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సదురు ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్ తాజాగా ఓ అమ్మాయితో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    -పట్టుకున్న మహిళ..
    ఈ జర్నలిస్ట్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది ఓ మహిళ అని వీడియోను బట్టి తెలుస్తోంది. అందులో జర్నలిస్ట్ ను ఆమె నిలదీయడం కనిపిస్తోంది. వీడియో తీస్తూ నిలదీయడంతో జర్నలిస్ట్ వీడియోను లాక్కున్నట్లు కనిపించింది. దీనిపై వీడియోలో జర్నలిస్ట్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాగా ఆ జర్నలిస్ట్ కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయినా ఓ అమ్మాయిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నట్లు నటిస్టూ ఎఫైర్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

    ఒక రూం నుంచి బయటకు వస్తున్న జర్నలిస్ట్ ను ఎవరో మహిళ పట్టుకున్నట్టుగా ఉంది. అయితే ఇది ఎఫైర్ కు సంబంధించిందా? లేక మరోదైనా అంశానికి సంబంధించిందో తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ రాసలీలల వీడియో అని వైరల్ అవుతోంది. దీనిపై సదురు జర్నలిస్ట్ స్పందించాల్సి ఉంది. నిజనిజాలేమిటో తెలియాల్సి ఉంది.