https://oktelugu.com/

JC Diwakar Reddy: పోలీసుల ఆధీనంలో జెసి కుటుంబం.. ఏం జరిగిందంటే?

తాడిపత్రిలో అల్లర్లు తగ్గాలంటే ఉభయ వర్గాలను స్థానికంగా ఉంచకూడదని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రిలో ఉండొద్దు అంటూ జేసి ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించి వేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2024 12:31 pm
    JC Diwakar Reddy

    JC Diwakar Reddy

    Follow us on

    JC Diwakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర హింస చెలరేగింది. అక్కడ జెసి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో దిగారు. అయితే ఆ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా హింస చెలరేగింది. తారా స్థాయికి చేరుకుంది. అసలే వివాద నియోజకవర్గం.. ఆపై ఫ్యాక్షన్ నేపథ్యం కలవరపాటుకు గురిచేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మంగళవారం రాత్రి నేరుగా పోలీసుల జేసీ వర్గాన్ని బెదిరించి లాఠీలతో కొట్టారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాడిపత్రిలో పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు.

    తాడిపత్రిలో అల్లర్లు తగ్గాలంటే ఉభయ వర్గాలను స్థానికంగా ఉంచకూడదని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రిలో ఉండొద్దు అంటూ జేసి ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించి వేశారు. జెసి కుటుంబాన్ని బలవంతంగా హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఘటనలు చల్లారాలంటే జెసి ఫ్యామిలీ ఇక్కడ ఉండకూడదు అని ఉద్దేశంతోనే తామే తరలించినట్లు పోలీసులు కూడా చెబుతున్నారు.జెసి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన భార్య, సోదరి కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. మిగిలిన వారిని వెంటనే హైదరాబాద్ కు పంపించేశారు.

    అయితే దివాకర్ రెడ్డి కుమారుడు హైదరాబాదు నుంచి తాడిపత్రి కి వచ్చారు. ఆయనను సైతం పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆయన కారు దిగకుండానే… తిరిగి వెళ్ళిపోయారు. మొత్తంగా చూస్తే దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అయింది. అయితే వైసిపి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరిస్థితి ఏంటి? అన్నది మాత్రం తెలియడం లేదు. ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఉదాసీనంగా వ్యవహరించారా? లేకుంటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే తాడిపత్రిలో అల్లర్ల నియంత్రణ పోలీసులకు కత్తి మీద సాములా మారింది.