Man Trapped: అతడో వృద్ధుడు.. పైగా 89 ఏళ్ల వయసు.. వయసుకు తోడు అల్జీ మర్స్ వ్యాధి (మతిమరుపు) ఉంది. ఇక షుగర్ పేషెంట్. ఇన్ని వ్యాధులున్న ఓ పెద్దాయన బ్యాంకు వచ్చాడు. అయితే రాత్రి అయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరుసటి రోజు ఉదయం బ్యాంకు సీసీటీవీ కెమరాలు చూసిన పోలీసులు షాక్ తిన్నారు. బ్యాంక్ లాకర్ గదిలోనే ఆ వృద్ధుడు చిక్కుకుపోయినట్టు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది నిర్వాకం, నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తేల్చారు.హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ యూనియన్ బ్యాంకులో చోటుచేసుకున్న ఈ ఘటన వైరల్ అయ్యింది.
Also Read: Kodali Nani Minister Post: కొడాలి నానికి మంత్రి పదవి దక్కుతుందా? లేదా?
హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని రోడ్ నంబర్ 67లో నివాసముందే కృష్ణారెడ్డి(84) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాకర్ పని నిమిత్తం జూబ్లిహిల్స్ చెక్ పోస్టులోని యూనియన్ బ్యాంక్ కు వెళ్లారు. అక్కడ లాకర్ గదిలోకి వెళ్లిన కృష్ణారెడ్డి తన ఆభరణాలు చూసుకొని ఆ పనిలో ఉన్నారు. అయితే కృష్ణారెడ్డి లోపలే ఉన్న విషయాన్ని గమనించని బ్యాంక్ సిబ్బంది లాక్ గదిని మూసివేశారు. సోమవారం రాత్రంతా ఆ వృద్ధుడు లాకర్ గదిలోనే ఉండిపోయారు.
కృష్ణారెడ్డి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆక్ష్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఆయన కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి బ్యాంకు వద్దకు వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కృష్ణారెడ్డి లోపలే ఉన్నట్టు గుర్తించారు. వెంటనే లాకర్ ఓపెన్ చేయించి కృష్ణారెడ్డిని బయటకు తీసుకొచ్చారు.
కృష్ణారెడ్డికి షుగర్ ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుమారు 18 గంటల పాటు ఆ వృద్ధుడు బ్యాంకు లాకర్ గదిలోనే బందీగా ఉండిపోయాడు. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఆ పెద్దాయనకు అల్జీమర్స్ ఉండడంతో ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఆ లాకర్ గదిలోనే రాత్రంతా గడిపిన దుస్థితి నెలకొంది.
Also Read: Rahul Gandhi Tweet On Paddy Procurement: రాహుల్ దయతో ఎట్టకేలకు టీఆర్ఎస్ తో ఫైట్ కు కాంగ్రెస్ రెడీ..