TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

TDP: ఆంధ్రప్రదేశ్ లో నేడు టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అధికారానికి దూరమైన నేపథ్యంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్బవించి నలభై ఏళ్లు అవుతున్న సందర్భంలో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు. ఇందుకు అందరిలో […]

Written By: Srinivas, Updated On : March 29, 2022 6:38 pm
Follow us on

TDP: ఆంధ్రప్రదేశ్ లో నేడు టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అధికారానికి దూరమైన నేపథ్యంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్బవించి నలభై ఏళ్లు అవుతున్న సందర్భంలో రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి 19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు. ఇందుకు అందరిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Chandrababu Naidu

ఇక చంద్రబాబు తరువాత లీడర్ గా కొనసాగేందుకు లోకేష్ కు అవకాశాలు తెస్తున్నా ఆయన మాత్రం తన స్వయంకృతాపరాధంతో కార్యకర్తలకు దగ్గర కాలేకపోతున్నారు.దీనిపై చంద్రబాబు ఆలోచనలో పడుతున్నారు. తన వారసుడిగా లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి పలుమార్లు నవ్వులపాలు అవుతున్నారు. తన తెలివితేటలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకోవాల్సిన నేత అందరిలో గుర్తింపు పొందలేకపోతున్నారు. కార్యకర్తలు లోకేష్ ను తమ భవిష్యత్ నాయకుడిగా చూడటం లేదు. అదే చంద్రబాబుకు బాధ కలిగిస్తోంది. తన కొడుకు సరిగా వ్యవహరిస్తే తనకు ఈ బాధలు ఉండేవి కాదని తల పట్టుకుంటున్నారు.

Also Read: MLA Rajaiah: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య?

మరోవైపు పార్టీని నడిపించాలంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం ఉండాల్సిందేననే వాదన కూడా కార్యకర్తల్లో వస్తోంది. ఇన్నాళ్లు అధికారానికి దూరమైన నేపథ్యంలో ఎన్టీఆర్ వస్తేనే పార్టీ పరిస్థితి మారుతుందని కార్యకర్తలు కోరుతున్నారు. దీనిపై చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన ఆతిథ్యం మాత్రం టీడీపీకి కచ్చితంగా ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టాలంటే సమర్థులైన నాయకులు కావాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఆ సత్తా జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని తెలుస్తోంది.

Chandrababu Naidu

బీసీల పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలో కూర్చోబెట్టాలంటే భారీ కసరత్తు ఉండాల్సిందే. నేతల సహకారం తప్పనిసరి. ఇప్పటికే వైసీపీ 151 సీట్లతో అధికారంలో ఉండటంతో దాన్ని దించాలంటే ఇంకా ఎక్కవ శక్తిగల నేతలు ఉండాల్సిందే. వారి మాటలకు ప్రజలు బ్రహ్మరథం పట్టాల్సిందే. అలాంటి వారైతేనే టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తుందని కార్యకర్తలు అభిలషిస్తున్నారు. దీనికి సమర్థుడు కార్యదీక్షాపరుడు అంటే ఎన్టీఆర్ అనే మాట అందరు కార్యకర్తల్లో నానుతోంది.

చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ను ఆహ్వానించి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు ఖరారుచేసుకోవాల్సిన సమయం వచ్చింది. రానున్న రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పటికే ఒక సమగ్ర రూపం రావాల్సిందే. లేకపోతే అప్పటికప్పుడు అంటే కష్టం. అందుకే ఎన్టీఆర్ ను పార్టీ కోసం పని చేయాలని కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి.

Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?

Tags