HomeతెలంగాణModi: 3 రోజులు.. 5 సభలు.. తెలంగాణలో మోదీ ప్రచారం షెడ్యూల్‌ ఇదీ!

Modi: 3 రోజులు.. 5 సభలు.. తెలంగాణలో మోదీ ప్రచారం షెడ్యూల్‌ ఇదీ!

Modi: పార్లమెంట్‌ ఎన్నిల నామినేషన్‌ ప్రక్రియ గురువారం(ఏప్రిల్‌ 25న) ముగియనుంది. దీంతో ఇక ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ అదినేత కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక బీజేపీ అభ్యర్థులు కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈమేరకు షెడ్యూల్‌ ఖరారైంది.

మూడు రోజులు..
ఏప్రిల్‌ 30వ తేదీ, మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 30 జహీరాబాద్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత శేరిలింగంపల్లిలో ఐటీ కంపెనీ ఉద్యోగులతో ప్రధాని సమావేశమవుతారు. తర్వాత మే 3వ తేదీన వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు. అదే రోజు భువనగిరి, నల్లగొండ పార్లమెంటు స్థానాలను కలుపుతూ మరో సభ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మే 4వ తేదీన మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నారాయణపేట, చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని వికారాబాద్‌లో మోదీ ప్రచార సభలు నిర్వహిస్తారని వివరించారు.

మెజారిటీ స్థానాలే లక్ష్యంగా..
తెలంగాణలో ఈసారి మెజారిటీ స్థానాలపై కమలం పార్టీ కన్నేసింది. పది స్థానాలు టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నామినేషన్‌ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. నామినేషన్లు ముగియగానే ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. రోడ్‌షోలు, సభలు నిర్వహించనున్నారు. ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచబోతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version