Deputy CM Pawan Kalyan: రోడ్డుమీదే కుర్చీ వేసుకొని.. ఇది కదా పవన్ కళ్యాణ్ పాలన అంటే?

తాజాగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వెలుపల ప్రజా దర్బార్ నిర్వహించారు. బయట కుర్చీలు టేబుల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Written By: Dharma, Updated On : June 22, 2024 6:54 pm

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan: పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు డిప్యూటీ సీఎం పవన్. గత రెండు రోజులుగా శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పవన్.. స్పీకర్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. సభ ఔన్నత్యాన్ని కాపాడుతూ ముందుకు సాగుతామని పవన్ ఇచ్చిన పిలుపునకు మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఫిదా అయ్యారు. అటు సీఎం చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుంచి వినూత్న రీతిలో సాగుతున్నారు పవన్.

తాజాగా పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వెలుపల ప్రజా దర్బార్ నిర్వహించారు. బయట కుర్చీలు టేబుల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రతిపక్షంలో ఉన్న మాదిరిగానే ప్రజా దర్బార్ నిర్వహించి అబ్బురపరిచారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం నాటి నుంచే పని మీద పడ్డారు పవన్. ఏకంగా 10 గంటల పాటు అధికారులతో సమీక్షించి.. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఇచ్చి.. లక్ష్యాలను విధించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీటి కల్పన వంటి వాటిపై మూడు నెలలు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు పవన్. వైసిపి కేవలం విజయానికి పరిమితమైందని.. ఓటమిని అంగీకరించలేని స్థితిలో ఉందని.. అందుకే సభలో లేకుండా పోయిందని ఎద్దేవా చేసిన పవన్.. శాసనసభలో సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. శాసనసభకు మొదటిసారి ఎన్నికయినా పవన్ హుందాగా వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ కార్యాలయం వెలుపల ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించారు. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. మొత్తానికి పవన్ చర్యలు చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.