తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తెలిపింది. జలశక్తిత ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత పనులు చేపట్టరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టుతో విస్తృత ప్రయోజనాలున్నా పర్యావరణం కూడా అవసరమేనని తెలిపింది. పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయాలపై అధ్యయం చేయాలని […]
తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తెలిపింది. జలశక్తిత ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చిన తరువాత పనులు చేపట్టరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టుతో విస్తృత ప్రయోజనాలున్నా పర్యావరణం కూడా అవసరమేనని తెలిపింది. పర్యావరణ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలకు ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయాలపై అధ్యయం చేయాలని సూచించింది.