హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సమీపంలోని ప్రాజెక్టులు నిండుతున్నాయి. ఇక నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ పూర్తిగా నిండినట్లయింది. తాజాగా 1,560 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. హుస్సేన్‌సాగర్ సామర్థ్యం 513.41 కాగా ప్రస్తుతం 513.67 మీటర్లుగా ఉంది. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచే వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలో మళ్లీ జలమయమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలకు ఆదేశించింది.