https://oktelugu.com/

టీడీపీ అనుకూల బ్యాచ్ కు గట్టి షాకిచ్చిన సోము వీర్రాజు!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడుకు పర్యాయపదంగా మారారు. ఇప్పటికే రావడం రావడమే ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా   దూకుడుగా ముందుకెళ్తున్నారు. జనసేనతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతూ ప్రతిపక్ష టీడీపీని, అధికార వైసీపీ తప్పులను ఎత్తి చూపుతూ జనాల్లోకి దూసుకెళ్తున్నారు. Also Read: అటు కేసీఆర్, ఇటు మోడీ.. దుబ్బాకలో కాంగ్రెస్ కు షాకిచ్చిన టీడీపీ! జగన్‌, బీజేపీ పార్టీల మధ్య అనుబంధంతో బీజేపీ కొత్త చీఫ్‌ సోము వీర్రాజు సైలెంట్‌గా ఉంటారని అందరూ అనుకున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 12:59 PM IST
    Follow us on

    ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడుకు పర్యాయపదంగా మారారు. ఇప్పటికే రావడం రావడమే ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా   దూకుడుగా ముందుకెళ్తున్నారు. జనసేనతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతూ ప్రతిపక్ష టీడీపీని, అధికార వైసీపీ తప్పులను ఎత్తి చూపుతూ జనాల్లోకి దూసుకెళ్తున్నారు.

    Also Read: అటు కేసీఆర్, ఇటు మోడీ.. దుబ్బాకలో కాంగ్రెస్ కు షాకిచ్చిన టీడీపీ!

    జగన్‌, బీజేపీ పార్టీల మధ్య అనుబంధంతో బీజేపీ కొత్త చీఫ్‌ సోము వీర్రాజు సైలెంట్‌గా ఉంటారని అందరూ అనుకున్నారు. హిందుత్వమే అజెండాగా నడిచే పార్టీ బీజేపీ. ఈ మధ్య ఏపీలో హిందూ దేవాలయాలపై నిత్యం జరుగుతున్న దాడులతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెలరేగిపోయారు. ప్రభుత్వంపై ఫైర్‌‌ అవుతున్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఏకంగా దీక్షలకు దిగారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్న చందంగా కేంద్రంలో వైసీపీ, బీజేపీ స్నేహంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి సోము వీర్రాజు స్వతంత్రంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాడు.

    ఇప్పటికే బీజేపీలోని టీడీపీ మద్దతుదారులకు సోము వీర్రాజు చెక్ పెట్టారు. బీజేపీ ఎంపీగా ఉంటూ టీడీపీపై గళమెత్తిన సుజనా చౌదరి నోటికి తాళం వేయించాడు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు బీజేపీ నేతలపై కూడా సస్పెన్షన్ విధించి షాకిచ్చారు. తాజాగా మరో సంచలన నిర్ణయంతో సోము వీర్రాజు వార్తల్లో నిలిచారు.

    సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్న బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ను సస్పెండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలోని టీడీపీ అనుకూల బ్యాచ్ కు గట్టి షాకిచ్చాడు. బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నేతలందరికీ దీని ద్వారా హెచ్చరికలు పంపారు. ఇన్నాళ్లు సస్పెన్లన్లు చేయడం అంటే ఢిల్లీ నుంచి నరుక్కు వచ్చేవారు. కానీ సోము వీర్రాజు ఉన్న ఫళంగా కట్టుదాటే నేతలపై సస్పెన్షన్లు వేస్తుండడం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడా?

    దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆయన జాతీయ స్థాయి మీడియాలోనూ తరుచూ పార్టీ తరుఫున కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడి సస్పెండ్ కు గురయ్యారు.

    జూలై 26న జరిగిన ఓ చానెల్ మీడియా చర్చలో పాల్గొన్నందుకు లంకా దినకర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. అందుకు ఆయన సరైన వివరణ ఇవ్వని కారణంగా సస్పెండ్ చేశామని బీజేపీ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.