ఆ ఇళ్లను ఖాళీ చేయండి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ పరిధిలోని కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని రాష్ష్ర ఐటీ, పురపాలక శాఖ  మంత్రి కె.తారకరామారావు సూచించారు. ప్రస్తతం అధిక వర్షాలు కురుస్తున్నందున పాత భవనాలు కూలిపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాని తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త కోసమే ఈ సూచనలు చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే భారీ వర్షంతో […]

Written By: Suresh, Updated On : October 12, 2020 3:24 pm
Follow us on

హైదరాబాద్ పరిధిలోని కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని రాష్ష్ర ఐటీ, పురపాలక శాఖ  మంత్రి కె.తారకరామారావు సూచించారు. ప్రస్తతం అధిక వర్షాలు కురుస్తున్నందున పాత భవనాలు కూలిపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాని తెలిపారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త కోసమే ఈ సూచనలు చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే భారీ వర్షంతో ఇల్లు కూలి చాలా మంతి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం బాగ్ లింగంపల్లిలో ఓ చిన్నారి మరణించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధికారులకు సూచనలు చేశారు.