యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య బాలీవుడ్లో కలకలం రేపింది. సుశాంత్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు రావడంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ కేసులో డ్రగ్స్ లింకులు కూడా బయటపడటంతో సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగి కేసును విచారణ చేపడుతున్న సంగతి తెల్సిందే..!
సుశాంత్ ఆత్మహత్య కేసులో తొలి నుంచి రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తి సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కావడంతో ఆమెపైనే అందరి దృష్టిపడింది. సుశాంత్ ఆత్మహత్యపై ప్రజల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమయ్యాయి. నెపోటిజం కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ వర్గం ఆరోపించగా మరోవర్గం రియా చక్రవర్తి కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించాయి.
ఈకేసులో కొన్ని మీడియా సంస్థలు రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేశాయి. ఈ కేసులో రియా చక్రవర్తిని.. ఆమె సోదరు షోవిక్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంలో పలు సంచలన విషయాలు బయటికొచ్చాయి. దాదాపు 28రోజుల జైలు జీవితం తర్వాత రియా చక్రవర్తికి బెయిల్ పై వచ్చింది. కాగా ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్ సుశాంత్ ది ఆత్మహత్యేనని.. హత్య కాదని సీఐబీకి నివేదిక ఇచ్చింది. దీంతో ఆమెకు కొద్దిగా ఊరట కలిగించే అంశమే.
అయితే అతడి ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేమించారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో రియా చక్రవర్తి ఇంటి పక్కనే ఉండే ఓ మహిళ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుశాంత్ ఆత్మహత్య ముందురోజు రాత్రి రియాను సుశాంత్ కారులో డ్రాప్ చేసినట్లు చెప్పింది. వీరిద్దరిని ఆరోజు తాను చూసినట్లు చెప్పింది. అయితే తాజాగా సీబీఐ ఆమెను విచారించేందుకు ఆదివారం వెళ్లగా సదరు మహిళ మాటమార్చినట్లు తెలుస్తోంది.
రియా.. సుశాంత్ కలిసి ఉండటాన్ని తాను స్వయంగా చూడలేదని.. ఎవరో తనకు చెబితే విన్నానని ఆమె చెప్పింది. దీంతో మీకు ఎవరు చెప్పారో చూపించాలని ఆమెను అడుగగా ఆ వ్యక్తి గురించి చెప్పలేనని సమాధానం దాటవేసే ప్రయత్నం చేసిందట. ఇక ఆ వ్యక్తి రియా..సుశాంత్ లను ఎప్పుడు.. ఎక్కడ చూశాడు.. అని సీబీఐ అడుగగా సదరు మహిళ సరైన సమాధానం చెప్పలేకపోయింది.
దీంతో అధికారులు ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆధారాల్లేకుండా ఇంకోసారి ఆరోపణలు చేస్తే చర్యలు చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాకు కొంత ఊరట లభిస్తుండగా డ్రగ్స్ కేసులో మాత్రం పీక్కల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మున్ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే..!