టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని ప్రజల్ని బెదిరింపులకు గురి చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నిన్న దుబ్బాకలో జరిగిన ఘటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఓటమి భయం, అధికార దాహంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు. బండి సంజయ్‌పై దాడి హేయమైన చర్య అని ఆమె పేర్కొన్నారు.