https://oktelugu.com/

రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని బండ్ల గణేష్. ఆయనపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తాడు. మరి ఫైర్ బ్రాండ్ , వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అంతకుమించి. అలాంటి ఆమె పవన్ పై నోరు పారేసుకుంటే బండ్ల ఊరుకుంటాడా.? ఓ న్యూస్ చానెల్ డిబేట్ లో వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. కొంత కాలం క్రితం జరిగిన ఈ డిబేట్ లో రోజా, బండ్ల గణేష్ బూతులు తిట్టుకున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 11:42 AM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని బండ్ల గణేష్. ఆయనపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తాడు. మరి ఫైర్ బ్రాండ్ , వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అంతకుమించి. అలాంటి ఆమె పవన్ పై నోరు పారేసుకుంటే బండ్ల ఊరుకుంటాడా.? ఓ న్యూస్ చానెల్ డిబేట్ లో వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. కొంత కాలం క్రితం జరిగిన ఈ డిబేట్ లో రోజా, బండ్ల గణేష్ బూతులు తిట్టుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కట్ చేస్తే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో రోజా, బండ్ల గణేష్ కలుసుకున్నారు. విభేదాలన్నీ పక్కనపెట్టి అప్యాయంగా పలకరించుకొని అప్యాయత చాటారు. తకాలం క్రితం జరిగిన వివాదాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఇలా కలిసిపోవడం అభిమానులకు సంతోషాన్ని పంచింది. రాజకీయంగా వేరుదారులైనా సినీ ఇండస్ట్రీ పరంగా తామిద్దరం ఒకటేనని బండ్ల ఈ ట్వీట్ తో నిరూపించినట్టైంది.

    Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్.. చరణ్ లకు అలియా ట్వీస్ట్ ఇవ్వనుందా?

    అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ కు హాజరైన వీరిద్దరూ పాత పగలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. ‘చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య , ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

    దీంతో రోజా-బండ్ల గణేష్ మధ్యన నెలకొన్న విభేదాలకు ఈ ట్వీట్ తో తెరపడినట్టైంది.

    https://twitter.com/ganeshbandla/status/1322199721889259521?s=20