సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెండ్లి అయిన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త విధులకు వెళ్లివచ్చేసరికే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం చిట్కుల్లోని నాగార్జున కాలనీకి పదిహేను రోజుల క్రితం రాఘవేంద్ర, సుకన్య దంపతులు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. కర్థనూరు సమీపంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో రాఘవేంద్ర కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లగా.. ఇంట్లో ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం దార్లపాడు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Married suicide tragedy in sangareddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com