కాంగ్రెస్ వరద సాయం రూ.50 వేలు: మెనిఫెస్టో విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం కాంగ్రెస్ మెనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా తన మెనిఫెస్టోలో భారీగా వరదసాయాన్ని ప్రకటించింది. హైదరాబాద్ లో కురిసిన వర్షం కారణంగా నష్టపోయిన బాధితుల ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తానని పేర్కొంది. అలాగే ఈ సంఘటనల్లో చనిపోతే రూ.25 లక్షలు చెల్లిస్తామంది. ఇక దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఇప్పటికే టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో వరద సాయం రూ. 10 […]

Written By: Suresh, Updated On : November 24, 2020 1:52 pm
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం కాంగ్రెస్ మెనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా తన మెనిఫెస్టోలో భారీగా వరదసాయాన్ని ప్రకటించింది. హైదరాబాద్ లో కురిసిన వర్షం కారణంగా నష్టపోయిన బాధితుల ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తానని పేర్కొంది. అలాగే ఈ సంఘటనల్లో చనిపోతే రూ.25 లక్షలు చెల్లిస్తామంది. ఇక దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఇప్పటికే టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో వరద సాయం రూ. 10 వేలు ప్రకటించింది. కొందరికి అందించి కూడా. అయితే ఎన్నికలు రావడంతో ఆ సాయం నిలిచిపోయింది. దీంతో ఎన్నికలు పూర్తి కాగానే వరదసాయం అందిస్తామని తెలిపింది. ఇక బీజేపీ రూ.25 వేల వరదసాయం ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం అందరిక కంటే ఎక్కువగా రూ.50 వేలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.