మెగా కోడలు ఉసాసన మల్టీ టాలెంటెడ్. బిజినెస్ రంగంతో పాటు డిజిటల్ రంగంలోనూ దూసుకెళ్తుంది. మొత్తానికి టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ, అర్హులైన నిపుణుల నుండి నిర్దుష్టమైన సమాచారాన్ని తెలుసుకుని.. ఆ సమాచారం మొత్తాన్ని తన శైలిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రజలకు అందించడానికి ఏకంగా URLife.co.in అనే వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఉపాసన ప్రస్తుత కాలానికి తగిన ఆరోగ్య సూత్రాలను, పోషకాల గురించిన వీడియోలను, ఆహార నియమాల ప్రణాళికలను, సూచనలను సెలబ్రిటీలతో ఇప్పిస్తూ నేటి కరోనా కాలంలో తన వంతుగా ఆరోగ్య సేవను చేస్తోంది.
Also Read: మహేష్ బాబుకు అనుకోని అవాంతరం
ఈ ఆరోగ్య సమాచారం ప్రజలకు చేరాలని పలువురు భామలని గెస్ట్ ఎడిటర్‌గా పిలిపించి మరీ, వారిచేత వెరైటీ వంటలు చేయిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటూ తాను పెట్టే కంటెంట్ అందరికీ చేరవేస్తోంది. అందులో భాగంగా ఆ మధ్య సమంతతో పోషకాహారపు వంటలు చేయించి వావ్ అనిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మికతో కోలిపట్టు కూర చేయించి అదరగొట్టేసింది. చికెన్‌తో చేసిన కోలిపట్టు కూర రుచి చూసిన ఉపాసన రష్మికకు వందకు వంద మార్కులు ఇచ్చింది. అంతేకాదు రష్మిక చెఫ్ గా పనికొస్తావు, ఎవరైన చెఫ్ ఛాన్స్ ఉంటే ఇవ్వండని పంచ్ కూడా వేసింది ఉపాసన.
Also Read: సినిమా సడలింపులు సరే.. టికెట్ రేటు తగ్గించరా.?
ఏది ఏమైనా ఉపాసన హెల్త్ పరంగా ఎవ్వరూ చెప్పని విలువైన సమాచారాన్ని అందరికీ అందడానికి ఆమె చూపిస్తోన్న చొరవ అద్భుతమైనది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక రష్మిక మండన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె పుష్ప సినిమా షూట్ తో ఫుల్ బిజీగా ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్