
భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అవుతోంది. రాజధాని నగరం సమీపంలోని హైదరాబాద్, బెంగుళూరు జాతీయ రహదారి రోడ్డు కోతకు గురైంది. గగన్‌పహాడ్ సమీపంలోని అప్పా చెరువు కట్ట తెగి జాతీయ రహదారిపై వరదనీరు చేరడంతో రహదారి ధ్వంసమైంది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 30 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.