టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే: బిహార్ లో గెలుపు ఎవరిదంటే?

బీహార్ ఎన్నికలు వేడి దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.. ఓవైపు సీఎం నితీష్ బీజేపీ మద్దతుతో మరోసారి గెలుపు గుర్రం ఎక్కాలని ప్రయత్నిస్తుండగా.. మరోవైపు నాన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడంతో మొత్తం బాధ్యతను తన భుజాలపై వేసుకొని కాంగ్రెస్ అండగా ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరోనా లాంటి మహమ్మారి దాడి తర్వాత దేశంలో ప్రధాని మోడీ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగిన వేళ బీహార్ […]

Written By: NARESH, Updated On : October 14, 2020 11:57 am
Follow us on

bihar elections

బీహార్ ఎన్నికలు వేడి దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.. ఓవైపు సీఎం నితీష్ బీజేపీ మద్దతుతో మరోసారి గెలుపు గుర్రం ఎక్కాలని ప్రయత్నిస్తుండగా.. మరోవైపు నాన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడంతో మొత్తం బాధ్యతను తన భుజాలపై వేసుకొని కాంగ్రెస్ అండగా ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరోనా లాంటి మహమ్మారి దాడి తర్వాత దేశంలో ప్రధాని మోడీ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగిన వేళ బీహార్ ఎన్నికలు బీజేపీ-జేడీయూ కూటమికి రెఫరెండంగానే రాజకీయ విశ్లేషకులు, జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.

Also Read: ట్రంప్‌కు టెన్షన్: ‘ముందస్తు ఓటింగ్‌’లో బైడెన్‌ ముందంజ..?

బిహార్ ఎన్నికల్లో వలస కూలీల వ్యథలు ప్రధాన అంశంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా వేళ వీరంతా వివిధ రాష్ట్రాల నుంచి నడిచి వచ్చారో తీవ్ర వర్ణనాతీతంగా ఉంది. ఇక కరోనా టైంలో నితీష్ సర్కార్ సరిగా ప్రజలు, కూలీలకు ఉపాధి కల్పించలేదనే అపవాదును మూటగట్టుకుంది. ఇక కేంద్రంలోని బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఓటర్లు ఉన్నారు. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కు ఇవే ఆయుధాలుగా ఉన్నాయి.

తాజాగా టైమ్స్ నౌ-సీఓటర్ బీహార్ ఎన్నికలపై సంచలన సర్వేను బయటపెట్టింది. ఇందులో ఆసక్తికర ఫలితం వెల్లడైంది. బీహార్ లో ఈసారి మరోసారి ఎన్డీఏ కూటమిదే గెలుపు అని సీఓటర్ సర్వే తేల్చింది. అయితే ఈ సర్వేలో బిహార్ లో పెద్ద పార్టీ అయిన జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే వీలుందని సర్వేలో తేలింది. మరి ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ సీఎం అవుతారా? నితీష్ కుమార్ ను దించుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

సీఓటర్ సర్వేలో 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 160 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తేలింది. ఇక ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 75 స్థానాల్లో గెలుస్తుందని అంచనావేసింది. సర్వే ప్రకారం.. బీజేపీ 121 స్థానాల్లో పోటీచేసి 84 స్థానాల్లో విజయం సాధిస్తే.. 122 స్థానాల్లో పోటీచేస్తున్న జేడీయూ కేవలం 70 సీట్లలోనే గెలుస్తుందని సర్వే తేల్చింది. ఇక ఎన్డీఏలో మిగిలిన పార్టీలకు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తెలిపింది.

Also Read: ఎంత పని చేసింది కరోనా.. కవితకు గెలిచిన సంబురం లేకపాయె!

ఇక ఆర్జేడీకి 56 సీట్లకు మించి రావని సర్వేలో తేలింది. దాని మిత్రపక్షం కాంగ్రెస్ 15 సీట్లు రావడం కష్టమని తేల్చింది. ఇక ఎన్డీఏ నుంచి వైదొలగిచిన ఎల్.జేపీకి ఐదు స్తానాలు మించి రావని అంచనా వేసింది. అయితే జేడీయూ అవకాశాలను ఎల్.జే.పీ దెబ్బతీస్తోందని సర్వే తెలిపింది. తాజా సర్వే ఫలితాలు బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుండగా అధికార జేడీయూను మాత్రం కొంత ఆందోళనకు గురిచేస్తోంది.