https://oktelugu.com/

కోరిక తీరకుండానే కన్నుమూసిన నృత్య మహారాణి !

కూచిపూడికి.. నేటి తరంలో ఆమె మహారాణి.. ఆమె నృత్యం అద్భుతం.. నాట్యం చేస్తున్న సమయంలో ఆమె పలికించే హావభావాలు ఆమోహం.. ఏభై సంవత్సరాలు పై పడిన కూచిపూడి మీద మక్కువతో ప్రేమతో ఆమె చేసిన ప్రదర్సనలు సేవలు అనీర్వచనం.. అంతటి గొప్ప కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు ఇకలేరు అనగానే నృత్యం బోసిపోయినట్టు అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో శోభానాయుడు తీవ్రంగా బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ.. […]

Written By:
  • admin
  • , Updated On : October 14, 2020 / 11:27 AM IST
    Follow us on


    కూచిపూడికి.. నేటి తరంలో ఆమె మహారాణి.. ఆమె నృత్యం అద్భుతం.. నాట్యం చేస్తున్న సమయంలో ఆమె పలికించే హావభావాలు ఆమోహం.. ఏభై సంవత్సరాలు పై పడిన కూచిపూడి మీద మక్కువతో ప్రేమతో ఆమె చేసిన ప్రదర్సనలు సేవలు అనీర్వచనం.. అంతటి గొప్ప కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు ఇకలేరు అనగానే నృత్యం బోసిపోయినట్టు అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో శోభానాయుడు తీవ్రంగా బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ.. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. అయినా ఆమె ఈ వయసులో నృత్యం గురించే ఆలోచించారు.

    Also Read: ఆ హీరోయిన్లకు ‘బ్రేకప్’..ఇలా కలిసొచ్చిందా?

    నిజానికి శోభా నాయుడు కొంత కాలంగా న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్నా… కూచిపూడిని మాత్రం వదిలిపెట్టలేదని.. తాను చికిత్స తీసుకుంటూనే ఉచితంగా కొంతమందికి కూచిపూడి నేర్పిస్తూ.. చివరకు జబ్బు నయం కాకపోవడంతో ఆసుపత్రిలోనే ఆమె మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. శోభానాయుడు ఏపీలోని విశాఖ సమీపంలోని అనకాపల్లిలో జన్మించారు. ఆమె తన 12 ఏళ్ల వయసులోనే కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ప్రారంభించి.. వెంపటి చినసత్యం దగ్గర శిష్యురాలిగా కూడా చేశారు.

    Also Read: వైరల్: అన్నయ్యను తలుచుకొని మహేష్ ఎమోషనల్

    ఇక తన కూచిపూడి ప్రదర్శనకు గుర్తింపుగా శోభానాయుడును 2001లో పద్మశ్రీ పురష్కారం కూడా వరించింది. అయితే శోభా నాయుడుకు ఒక చివరి కోరిక ఉందట. ఎప్పటికైనా కూచిపూడికి సంబంధించి.. నేషనల్ వైడ్ గా గొప్ప విద్యాసంస్థను స్థాపించాలని.. అలాగే కూచిపూడి గొప్పతనాన్ని తెలియజేసే ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించాలని ఆమె ఆశ పడ్డారట. కానీ విధి రాత… కోరిక తీరకుండానే శోభా నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయారు.

    Tags