ZTE voyage 3D : ట్రెండింగ్ లో ఉన్న ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?

ZTE voyage 3D ఈ ఫోన్ లో 33 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తే 4500 ఎంహెచ్ఏ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లో 5జి, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ - సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.. అయితే ఈ ఫోన్ ను ₹ 17, 225 కు విక్రయిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది..

Written By: NARESH, Updated On : June 28, 2024 12:34 pm

ZTE voyage 3D

Follow us on

ZTE voyage 3D : రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం మారుతోంది. మనిషి అవసరాల ఆధారంగా కొత్త రూపు సంతరించుకుంటున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లు కూడా సరికొత్త రూపు దాల్చుతున్నాయి. అద్భుతమైన సాంకేతికతతో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ జెట్ టీఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను తెరపైకి తీసుకువచ్చింది.. దీనికి ZTE voyage 3D అని పేరు పెట్టింది.. ఇది ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్డ్ ఐ 3D మొబైల్ ఫోన్. పైగా దీని డిస్ ప్లే 3D display లాగా పనిచేస్తుందట.

ఈ ఫోన్ డిస్ ప్లే పై ఒక్క క్లిక్ చేస్తే 2d స్క్రీన్ కాస్త త్రీడీలోకి మారుతుందట. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఈ సౌకర్యం వినియోగదారులకు కల్పించినట్టు ఈ కంపెనీ చెబుతోంది. వాయిస్ ట్రాన్స్ లేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్, చాట్ డైలాగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.. ఇందులో 6.58 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి + ఎల్సిడి 3d డిస్ ప్లే ఉంది. ఈ ఫోన్ అక్టో కోర్ యూని సోక్ టి760 6 ఎన్ఎం ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 6 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ లభిస్తోంది.. ఈ ఫోన్లో 50 మెగాపిక్సల్ తో కూడిన రెయిర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకునేందుకు 5 మెగాపిక్సల్స్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ ఫోన్లో ఉంది.

ఈ ఫోన్ లో 33 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తే 4500 ఎంహెచ్ఏ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లో 5జి, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ – సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.. అయితే ఈ ఫోన్ ను ₹ 17, 225 కు విక్రయిస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.. యువతను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ రూపొందించినట్టు తయారీ సంస్థ చెబుతోంది.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇందులో అత్యాధునికమైన ఫీచర్లను జోడించినట్టు వివరిస్తోంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కొనుగోలు పై క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.