Prabhas: ప్రభాస్ మాటంటే మాటేనబ్బా.. నెక్ట్స్ సినిమా అదే

నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకొని పోతుంది. ముఖ్యంగా ప్రభాస్‌, అమితాబ్‌ల నటన, నాగ్‌ అశ్విన్‌ కథను తీర్చిదిద్దిన విధానంతో థియేటర్ లలో విజిల్స్ వినిపిస్తున్నాయి.

Written By: Swathi, Updated On : June 28, 2024 12:27 pm

Prabhas

Follow us on

Prabhas: అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ప్రభాస్. ఆదిపురుష్ సినిమా విడుదల సమయంలో ఇక మీద ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందకు వస్తానని.. కుదిరితే మూడు సినిమాలు చేస్తాను అన్నారు. చెప్పినట్టే ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు ప్రభాస్.గత సంవత్సరం డిసెంబరు చివరిలో ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌ తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేశారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు అంటే ఆరు నెలల్లో ‘కల్కి 2898 ఏడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకొని పోతుంది. ముఖ్యంగా ప్రభాస్‌, అమితాబ్‌ల నటన, నాగ్‌ అశ్విన్‌ కథను తీర్చిదిద్దిన విధానంతో థియేటర్ లలో విజిల్స్ వినిపిస్తున్నాయి. అది సరే మరి ప్రభాస్ ఏ సినిమాతో మరోసారి ముందుకు రాబోతున్నారు అనుకుంటున్నారా? ప్రభాస్‌ సినిమాల జాబితా చూస్తే, మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాజా సాబ్‌’తో ఆయన ప్రేక్షకుల మందుకు రానున్నారు. సలార్ పార్ట్ 2 అదేనండి‘సలార్‌: శౌర్యంగ పర్వం’ షూటింగ్‌ కొన్ని రోజుల కిందటే మొదలైంది.

ఈ సినిమా ఘన విజయం అందుకుంది కాబట్టి.. దీనికి మించి ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో బలమైన డ్రామాగా ప్రశాంత్‌నీల్‌ నెక్ట్స్ మూవీని తీర్చిదిద్దడానికి సిద్ధం అవుతారు. అంతే ఈ సినిమా మరింత ఆలస్యం కానుంది. ఇది కాకుండా సందీప్‌ వంగా దర్శకత్వంలో‘స్పిరిట్‌’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను సందీప్‌ లాక్‌ చేస్తారని టాక్. నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక పూర్తయ్యే సరికి మరికొన్ని నెలలు పడుతుంది కాబట్టి..ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్.

అందుకే ‘రాజా సాబ్‌’తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రభాస్. ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. కాస్త సమయం ప్రభాస్ కేటాయిస్తే ఈ సినిమా పూర్తి అవుతుంది. రొమాంటిక్ హారర్‌ ఫిల్మ్‌గా ఇప్పటివరకూ ప్రభాస్‌ నటించని సరికొత్త జానర్‌లో ఈ సినిమా రాబోతుంది. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ లు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.