https://oktelugu.com/

Kalki 2898 AD : కల్కిలో నటించినందుకు విజయ్ దేవరకొండ మీద పెరుగుతున్న ట్రోలింగ్స్… కారణం ఏంటంటే..?

Kalki 2898 AD : చాలా గంభీరంగా ఉంటూనే తన కర్తవ్యం మీద తన ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు అంతే తప్ప ఆ కేర్లెస్ డైలాగులు చెప్పడం అర్జున్ రెడ్డి మేనియాలో ఆటిట్యూడ్ ను చూపించడం అనేది కరెక్ట్ విషయం కాదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 28, 2024 / 12:41 PM IST

    Vijay Deverakonda for acting in Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ అర్జునుడి క్యారెక్టర్ ను పోషించి మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది.

    కానీ ఈ సినిమాని చూసిన చాలా మంది ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా విజయ్ దేవరకొండ మీద కొన్ని ట్రోలింగ్స్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే అర్జునుడు అంటే చాలా గంభీరంగా ఉంటూ లక్ష్యం మీదే ఫోకస్ పెట్టుకొని ఒక యోధుడులా కనిపించాలి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం అవన్నీ ఏమీ లేకుండా అర్జున్ రెడ్డి ఆటిట్యూడ్ తో డైలాగులు చెప్పినట్టుగా కూడా కనిపించింది. అందువల్ల వాళ్ళందరూ అర్జునుడు అంటే అలా ఉండడు.

    చాలా గంభీరంగా ఉంటూనే తన కర్తవ్యం మీద తన ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు అంతే తప్ప ఆ కేర్లెస్ డైలాగులు చెప్పడం అర్జున్ రెడ్డి మేనియాలో ఆటిట్యూడ్ ను చూపించడం అనేది కరెక్ట్ విషయం కాదు. అందువల్ల నాగీ అర్జునుడిగా విజయ్ ని తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి.

    ఇక గత కొద్ది రోజుల నుంచి సక్సెస్ అనేది లేని విజయ్ ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ ని సాధించాను అని అనుకుంటున్నా సమయంలోనే ఇలాంటి ట్రోలింగ్స్ రావడం పట్ల ఆయన తీవ్రంగా బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ పాత్రలో వేరే హీరో నటించి ఉంటే ఇంకా ఈ సినిమా మీద ఇంపాక్ట్ అనేది భారీ లెవెల్లో ఉండేది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న కల్కి ఫైనల్ గా ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ ను రాబడుతోందో చూడాలి…