Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీYouTube: వినియోగదారులకు షాకిచ్చిన యూట్యూబ్.. ఇక అలా చూడాలంటే మరింత ఖర్చు చేయాల్సిందే!

YouTube: వినియోగదారులకు షాకిచ్చిన యూట్యూబ్.. ఇక అలా చూడాలంటే మరింత ఖర్చు చేయాల్సిందే!

YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ వీక్షించేందుకు తీసుకొచ్చిన ఈ సదుపాయం పొందాలంటే ఇకపై ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్‌ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.149గా నిర్ణయించింది. ఇంతకు ముందు ఈ ధర రూ.129గా ఉండేది. గతంలో రూ.189గా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. ఫ్యామిలీ ప్లాన్‌ తీసుకుంటే కుటుంబంలోని ఐదుగురు ప్రీమియం ప్రయోజనాలు పొందొచ్చు. ఇక ప్రీమియం స్టూడెంట్‌ ప్లాన్‌ ధర రూ.79 నుంచి రూ.89కి పెంచింది. ప్రీపెయిడ్‌ తోపాటు రెన్యువల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలను కూడా వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సవరించింది.

వ్యక్తిగత ప్రీపెయిడ్‌ ధరలు ఇలా..
ఇక వ్యక్తిగత ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.159కి సవరించింది. గతంలో ఈ ధర కేవలం రూ.139గా ఉండేది. వ్యక్తిగత క్వార్టర్లీ ప్లాన్‌ ధర రూ.399 నుంచి రూ.459కి సవరించింది. ఇక వార్షిక ప్లాన్ను రూ.1,290 నుంచి రూ.1,490కి పెంచేసింది. అంటే ఏకంగా రూ.200 అధికం. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్‌ 30 సెకండ్లపాటు అని స్కిప్పబుల్‌ యాడ్న్‌ చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.

సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగా ధర..
యాడ్స్‌ లేని కంటెంట్‌ చూడాలంటే కచ్చితంగా యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబ్‌ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్‌ ప్రీమియం ధర సబ్‌స్క్రిప్షన్‌ వ్యవధి ఆధారంగా మారుతుంది. యూట్యూబ్‌ ప్రీమియం సభ్యత్వాన్ని కొనుగోలు చేయని వారికి ఈ ఆఫర్‌ కనిపిస్తుంది. ఆఫర్‌ను క్లెయిమ్‌ చేసే ప్రక్రియ చాలా సులభం. యూట్యూబ్‌ యాప్‌ని తెరిచి, మీ ప్రొఫైల్‌ చిహ్నం నొక్కి, యూట్యూబ్‌ ప్రీమియం పొందండి ఎంచుకోండి. ఉచిత మూడు నెలల ఆఫర్‌ను ఎంచుకుని, ఆపై 3–నెలల ఉచిత నెలవారీ సభ్యత్వాన్ని నొక్కి మీ బ్యాంక్‌ కార్డ్‌ వివరాలను నమోదు చేయాలి. మీరు యూట్యూబ్‌ ప్రీమియంను మూడు నెలలపాటు ఉచితంగా ఉపయోగించగలరు. ఆ తర్వాత మీరు నెలకు రూ. 149 చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీలను నివారించడానికి, ఆఫర్‌ గడువు ముగిసే కొన్ని రోజుల ముందు వినియోగదారులు సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెండు జీమెయిల్‌ ఐడీలు ఉన్నట్లయితే మీరు యూట్యూబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం ఉపయోగించని ఖాతాతో కూడా ఆఫర్‌ను క్లెయిమ్‌ చేయవచ్చు.

ప్రయోజనాలివే..
యూట్యూబ్‌ ప్రీమియం మార్కెట్‌లోని కొన్ని ఇతర ఆడియో స్ట్రీమింగ్‌ యాప్‌ల కంటే మెరుగైన ఎంపిక, పూర్తిగా వినియోగదారు పొందే ప్రయోజనాల కారణంగా. వినియోగదారులు యూట్యూబ్‌ యాప్‌ని ఉచితంగా ఉపయోగించడమే కాకుండా యూట్యూబ్‌ యాప్‌లో ప్రకటన రహిత వీడియోలను కూడా చూడవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version