Unified Pension Scheme : ఏకీకృత పింఛన్ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కిన అతిపద్ద విజయం.. పోరాటం నుంచి గెలుపు వరకు పూర్తి కథనం..

యూపీఎస్ ఒక విజయం.. ఇది దేశ నిర్మాణానికి జీవితకాల సేవ చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది. కంట్రిబ్యూటరీ వేతనం, దాని ఫండింగ్ స్వభావాన్ని నిలుపుకోవడం ద్వారా..

Written By: Mahi, Updated On : August 27, 2024 4:31 pm

Unified pension Scheme

Follow us on

Unified Pension Scheme: ఏకీకృత పింఛన్ పథకం (యూపీఎస్) అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న 24 గంటల్లోనే.. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరింది. మహారాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం యూపీఎస్ విధానాన్ని అవలంభించాలని నిర్ణయం తీసుకుంది. సహకార సమాఖ్య విధానాన్ని అమలు చేయడం మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు పన్ను బదలాయింపు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడం, మూలధన వ్యయం దిశగా రాష్ట్రాలను ప్రోత్సహించడం, ఆర్థిక పరిస్థితిపై పారదర్శకంగా వ్యవహరించేలా ఒత్తిడి చేయడం వంటి చర్యలతో పాటు, యూపీఎస్ పాలనలో మార్పులు సహకార సమాఖ్య విధానానికి మరో సానుకూల పరిణామం. పెన్షనర్లకు 12 నెలల సర్వీసులో తీసుకున్న సగటు మూల వేతనంలో 50 శాతం పెన్షన్ గా హామీ ఇవ్వడం ద్వారా మరింత భరోసా కలుగుతుంది. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రవేశపెట్టిన సంస్కరణలను విస్మరించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ల కాంట్రిబ్యూటరీ స్వభావం, దీనిలో ఉద్యోగులు సర్వీసులో ఉన్న సమయంలో పొందే జీతం నుంచి వారికి పింఛన్ కు ఇస్తారు. ఏదేమైనా ఈ సంస్కరణ సహకార సమాఖ్య వ్యవస్థకు అతిపెద్ద విజయాలలో ఒకటిగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. కొన్నేళ్లుగా, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు 2003 కంటే ముందు ఉన్న పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) కు తిరిగి వచ్చాయి. ఈ రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే సమయంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ఓపీఎస్ నాన్ కంట్రిబ్యూటరీ, నిధులు లేని సంస్థ. అందువల్ల, తక్షణ కాలంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బు పెన్షన్ నిధికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని ద్వారా డబ్బు ఆదా అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం బల్క్ గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయంలో చిక్కులు లేకపోలేదు. రాష్ట్రాలు ఈ విధానాన్ని అవలంభించడం ఆందోళనకరంగా మారింది, ఆర్బీఐ సెప్టెంబర్, 2023 లో తన బులెటిన్ లో ‘ఎన్పిఎస్ కంటే 4.5 రెట్లు పెరిగినందున ఓపీఎస్ కు తిరిగి రావడానికి ఆర్థిక వ్యయం భారీగా ఉంటుంది.’ అని పేర్కొంది. ‘రాష్ట్రాలు ఓపీఎస్ కు తిరిగి ఇవ్వడం ఆర్థికంగా లాభదాయకం కాదు. అయినప్పటికీ ఇది వారి పెన్షన్ వ్యయంలో తక్షణ తగ్గుదలకు దారితీస్తుంది.’ అని ఆ కథనం పేర్కొంది. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకొని యూపీఎస్ ను అవలంభించే అవకాశం ఉంది. మూలధన మౌలిక సదుపాయాలపై ఖర్చు చేసేందుకు రాష్ట్రాలకు ఆర్థిక స్థలం ఉంది, దీని ఫలితంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు, ప్రజలకు మెరుగైన జీవన నాణ్యత లభిస్తుంది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడం చాలా కాలంగా ఉన్న సమస్య. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాలను తీర్చేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం బడుగు, బలహీన వర్గాల సంక్షేమ చర్యలకు నిధులను కేటాయించడంతో సమతుల్యం చేయాలి. కరోనా అనంతర పరిస్థితుల్లో రాష్ట్రాలు భారీ మూలధన వ్యయాలకు ఊతమిచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మూలధన పెట్టుబడులకు ప్రత్యేక సాయాన్ని ఎనిమిది రెట్లు పెంచింది.

మూలధన పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల రూపంలో రూ. లక్ష కోట్లు అందించింది. ఈ రుణం రాష్ట్రాలకు అనుమతించిన సాధారణ రుణ పరిమితి కంటే ఎక్కువగా ఉండాలి. ఈ ఏడాది బడ్జెట్ లో దీన్ని రూ. 1.3 లక్షల కోట్లకు పెంచారు. మూలధన వ్యయంలో రాష్ట్రాలు తమ సొంత బడ్జెట్లకు అనుగుణంగా ఉండేలా చూడడం. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా తమ సొంత ఖర్చులను భర్తీ చేయకుండా చూడడం ఈ పథకాన్ని బలోపేతం చసేందుకు హేతుబద్ధత.

అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, సుస్థిరత తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ల ద్వారా అందించే స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) రుణాలను రాష్ట్రం చేసిన రుణాలుగా పరిగణిస్తారు. సొంత రాష్ట్రమైన తెలంగాణలో గత ప్రభుత్వం ఇలాంటి బడ్జెట్ అప్పులను ఉపయోగించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది. బడ్జెట్ రుణాల్లో పారదర్శకతకు కొత్త ఊతమివ్వడం వల్ల తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకున్న అంతరాన్ని పూడ్చనుంది.

యూపీఎస్ ను ఆమోదించడంపై విపక్షాలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతున్నాయి. జాతీయ భద్రత, ఆర్థిక విధానం, ఇతర కీలక అంశాలపై ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.

యూపీఎస్ ఒక విజయం – ఇది దేశ నిర్మాణానికి జీవితకాల సేవ చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది. కంట్రిబ్యూటరీ వేతనం, దాని ఫండింగ్ స్వభావాన్ని నిలుపుకోవడం ద్వారా ఇది వస్తుంది. అందువల్ల సంస్కరణల కొనసాగింపు ఉంది. అయితే, దీని అర్థం పాలసీని సంకుచిత దృష్టితో చూడడం. అనుబంధ పథకాల ద్వారా రాష్ట్రాల్లో మూలధన పెట్టుబడులను పెంచడం, రుణాల్లో పారదర్శకత, రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవకాశం కల్పించడం వంటి చర్యల్లో ఈ మార్పు చూడాలి. అందుకే యూపీఎస్ పథకానికి దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. ఆ కోణం నుంచి చూస్తే, సహకార సమాఖ్య వ్యవస్థ కోసం ప్రధాని మోడీ చేస్తున్న కృషికి ఇది గొప్ప విజయం.