Health Tips : గర్భం దాల్చాలన్నా.. పిల్లలు పుట్టాలంటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి?

స్త్రీలతో పాటు పురుషులు కూడా పునరుత్పత్తి సమస్యలు ఉంటాయి. వీర్య కణాలు తక్కువగా ఉంటే పిల్లలు కలగడం కష్టం. వీర్య కణాలు ఎంత నాణ్యత ఉంటే స్త్రీలు గర్భవతి అయ్యే ఛాన్స్‌ అంత ఎక్కువగా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ వాళ్ల పరిమాణం, చలనశీలతను బట్టి మారుతుంటుంది.

Written By: Bhaskar, Updated On : August 16, 2024 12:56 pm

Sperm count in men

Follow us on

Health Tips  : యువత ఈమధ్య కాలంలో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరిన తర్వాత లేదా పెళ్లి అంటే ఇష్టం లేక, వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం చాలామంది లేటుగానే వివాహం చేసుకుంటున్నారు. లేటుగా వివాహం చేసుకున్నవాళ్లలోనే కాకుండా చాలామందిలో సంతాన సమస్యలు కనిపిస్తున్నాయి. జీవనశైలిలో మార్పుల వల్లే ఈ సమస్య ఎక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. పురుషులు అయితే ఎక్కువగా మద్యం, ధూమపానానికి అలవాటు అయ్యారు. కేవలం ఇవే కాకుండా సరైన పోషకాహారం లేకపోవడం, నిద్రలేమి, వ్యాయామాలు చేయలేకపోవడం, ఒత్తిడి, జంగ్ ఫుడ్స్‌ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్పెర్ప్ కౌంట్ నాణ్యత లేకపోతే పిల్లలు పుట్టడం కష్టమే. పిల్లలు పుట్టకపోతే అందరూ అమ్మాయి మీదే నింద వేస్తారు. ఆమెకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని, టెస్ట్ చేసుకోమని చెబుతారు. కానీ పురుషుడి స్పెర్మ్ కౌంట్ సరిగ్గానే ఉందా లేదా అని మాత్రం ఆలోచించరు. అయితే పురుషులకు స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంటే పిల్లలు పుడతారో తెలుసుకుందాం.

స్త్రీలతో పాటు పురుషులు కూడా పునరుత్పత్తి సమస్యలు ఉంటాయి. వీర్య కణాలు తక్కువగా ఉంటే పిల్లలు కలగడం కష్టం. వీర్య కణాలు ఎంత నాణ్యత ఉంటే స్త్రీలు గర్భవతి అయ్యే ఛాన్స్‌ అంత ఎక్కువగా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ వాళ్ల పరిమాణం, చలనశీలతను బట్టి మారుతుంటుంది. కొందరి వీర్యంలో రక్తస్రావం ప్రోస్టేట్ గ్రంధిలో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. మహిళలు గర్భం దాల్చాలంటే స్పెర్మ్‌లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. వీటికి డాక్టర్‌ను సంప్రదించి వెంటనే మందులు వాడాలి. లేకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఒక మిల్లీలీటర్ వీర్యంలో 20-110 లక్షల వీర్య కణాలు ఉండాలి. వాటి నాణ్యత 42 శాతం ఉండాలి. అప్పుడే మహిళలు గర్భం దాల్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

స్త్రీ శరీరంలో వీర్యకణాలు ఐదు రోజులు మాత్రమే నివసిస్తాయి. వీర్యం ఎండిపోతే వెంటనే స్పెర్మ్‌లు నాశనం అవుతాయి. 90శాతం పురుషుని స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండదు. ఆరోగ్యంగా ఉన్న స్పెర్మ్ మాత్రమే ఎగ్‌లోకి చేరుతుంది. కాబట్టి కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా సంతానోత్పత్తి విషయంలో జాగ్రత్త వహించాలి. మద్యం, ధూమపానంకి దూరంగా ఉండాలి. యోగా, వ్యాయామం వంటివి చేయడంతో పాటు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. తినే ఆహారంలో మాంసకృత్తులు, కొవ్వులు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు, ఫైబర్ ఉండేలా చూసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉండే పాలకూరను తినాలి. దానిమ్మ గింజలు, పుచ్చకాయ కూడా స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సాయపడతాయి. జింక్ ఎక్కువగా ఉండే జీడిపప్పును తినాలి. అలాగే వెల్లుల్లి, అరటిపండ్లు, యాపిల్, టమాటా వంటివి తింటే వీర్య కణాలు పెరుగుతాయి. అలాగే ఎక్కువగా సైక్లింగ్ చేయవద్దు. దీనివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.