దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉపయోగిస్తున్న యాప్స్ లో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్ గతంలో మల్టీ డివైజ్ సపోర్ట్, రీడ్ లేటర్, మీడియా అప్ లోడ్ క్వాలిటీ, వ్యూ వన్స్ లాంటీ ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ఫీచర్లు వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ ఫీచర్లలో కొన్ని ఫీచర్లు పరీక్షల దశలో ఉన్నాయని సమాచారం. వాట్సాప్ బీటా ఇన్ఫో త్వరలోనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. వాట్సాప్ కొత్త ఫీచర్లలో వాయిస్ మెసేజ్ కు సంబంధించిన కొత్త ఫీచర్ రానుంది. ఇకపై వాయిస్ మెసేజ్ ను రికార్డ్ చేసి యూజర్ విన్న తరువాత అవతలి వ్యక్తులకు పంపవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే వాట్సాప్ ఆటోమేటెడ్ సంస్థలు ఆ ఖాతాలను బ్లాక్ చేయనున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా రిక్వెస్ట్ ఏ రివ్యూ పేరుతో వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. రివ్యూ కోరిన 24 గంటల్లో సమస్య దూరమవుతుంది. గ్రూప్ కాలింగ్ ప్రారంభమైన తర్వాత మధ్యలో జాయిన్ అయ్యేలా మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకురానుందని తెలుస్తోంది.
ఎవరైనా పనిలో బిజీగా ఉండి వాట్సాప్ కాల్ లో జాయిన్ కాకపోయినా తర్వాత సులభంగా కాల్ లో జాయిన్ కావచ్చు. అయితే ఐఓఎస్ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్లు అందుబాటులోకి రావాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.