దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటనే సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నవాళ్లకు బ్యాంక్ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుండటం గమనార్హం. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో శాలరీ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందడానికి అర్హులని చెప్పవచ్చు. ఈ బ్యాంకులో అకౌంట్ కలిగిన వాళ్లు ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద రుణం పొందవచ్చు.
బ్యాంక్ లో తీసుకున్న అకౌంట్ ను బట్టి పొందే ప్రయోజనాలలో కూడా మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం శాలరీ అకౌంట్లలో సిల్వర్, గోల్డ్, ప్రీమియం, ప్లాటినం రకాలు ఉండగా ఎంచుకున్న రకాన్ని ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సిల్వర్ రకం శాలరీ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లకు 50వేల రూపాయల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది.
గోల్డ్ రకం శాలరీ అకౌంట్ కలిగి ఉన్నవాళ్లకు లక్షన్నర రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం అకౌంట్ ను కలిగి ఉన్న ఖాతాదారులకు 2.24 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం ఉండగా ప్లాటినం రకం శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లకు 3 లక్షల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో శాలరీ కౌంట్ ఉన్నవాళ్లకు మరో బెనిఫిట్ కూడా ఉంది. వీరికి బ్యాంక్ ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ అందిస్తుండగా పర్సనల్ యాక్సిడెంట్ కు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఖాతాను తీసుకున్న వాళ్లు బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ను కచ్చితంగా ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.