IMAX Screen: ఐమాక్స్‌ స్క్రీన్‌ అంటే ఏంటి? హైదరాబాదుకు రాబోతున్న దీని ప్రత్యేకత ఏంటి?

ఐమ్యాక్‌ ప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్‌లో సినీ ప్రియుల కల నెరవేర్చబోతున్నారు. అనుకున్న సమయం కన్నా ముందే ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ సినీ లవర్స్‌కు అందుబాటులోకి రాబోతోంది.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 3:16 pm

IMAX Screen

Follow us on

IMAX Screen: దేశంలోని ఏ మెట్రో నగరానికీ లేనంతగా హైదరాబాద్‌లో సినీరంగం ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే పెద్ద ఈవెంట్‌ చిత్రాలు గణనీయమైన కలెక్షన్లు వసూలు చేస్తాయి. కానీ తెలుగు మార్కెట్‌లో ప్రధాన కేంద్రం అయినా ఇప్పటికీ హైదరాబాద్‌లో ఐమాక్స్‌ స్క్రీన్‌ లేకపోవడం గమనార్హం. చెన్నై, బెంగళూరుతోపాటు దక్షిణ నగరాల్లో బహుళ ఐమ్యాక్స్‌ స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌ సినీ ప్రియులకు మాత్రం ఆలోటు ఉంది.

నెరవేరబోతున్న ఐమ్యాక్స్‌ డ్రీమ్‌..
అయితే ఐమ్యాక్‌ ప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్‌లో సినీ ప్రియుల కల నెరవేర్చబోతున్నారు. అనుకున్న సమయం కన్నా ముందే ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ సినీ లవర్స్‌కు అందుబాటులోకి రాబోతోంది. పంజాగుట్టలోని పీవీఆర్, నెక్ట్స్‌ గ్యాలేరియా ఔట్‌లెట్‌లలో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈమేరకు బెంగళూరుకు చెందిన ఐమ్యాక్‌ స్క్రీన్‌ భాగస్వామ్యంతో పీవీఆర్‌ హైదరాబాద్‌లో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేయబోతోంది.

ఐమ్యాక్‌ అంటే..
ఐమ్యాక్‌ అనేది మోషన్‌ పిక్చర్‌ ఫిల్మ్‌ ఫార్మాట్‌. ఇది హై–రిజల్యూషన్‌∙కెమెరాలు, ఫిల్మ్‌ ఫార్మాట్‌లు, ఫిల్మ్‌ ప్రొజెక్టర్లు, ఫిల్మ్‌ థియేటర్ల వ్యవస్థను కలిగి ఉంటుంది. 1970లో కెనడాలో అభివృద్ధి చేయబడింది, ఐమ్యాక్‌ దాని పెద్ద స్క్రీన్‌లతో వీక్షకుడికి లీనమయ్యే చలనచిత్రాలను చూసే అనుభూతిని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఐమ్యాక్‌ థియేటర్‌ స్క్రీన్‌లు 1.43:1 లేదా 1.9:1 యొక్క పొడవైన నిష్పత్తిని కలిగి ఉంటాయి. స్క్రీన్‌లు 18 నుంచి 24 మీటర్ల పరిమాణంలో ఉంటాయి, జర్మనీలోని లియోన్‌బర్గ్‌లో అతిపెద్ద స్క్రీన్‌ 38.8 మీ 21 మీ. లియోన్‌బెర్గ్‌లోని ఐమ్యాక్‌ స్క్రీన్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. దీని పరిమాణం 814.8 స్వయర్‌ మీటర్లు.

సంప్రదాయ థియేటర్లకు భిన్నంగా..
ఇక ఐమ్యాక్స్‌ స్క్రీన్‌లో సినిమాలు అడ్డంగా నడుస్తాయి. దీనివలన చిత్రం వెడల్పు ఫిల్మ్‌ స్టాక్‌ వెడల్పు కంటే ఎక్కువగా ఉంటుంది. డోమ్‌ స్క్రీన్లతో ఉద్దేశించిన–నిర్మిత థియేటర్లలో ఇది ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. దీంతో సాధారణ థియేటర్లలో సినిమా చూసినదానికన్నా భిన్న అనుభవం కలుగుతుంది.