Suzuki Cappuccino: క్యాపిచ్చినో అంటే కాఫీ అనుకుంటివా.. కాదు అద్దిరిపోయే కారు! మళ్లీ వస్తోంది

Suzuki Cappuccino: సుజుకీ, టయోటాలు సంయుక్తగా సరికొత్త ఎంట్రీ లెవల్ కారును తీసుకురాబోతున్నాయి. అదే సుజుకీ క్యాపిచ్చినో. ఈ పేరు వినగానే చాలా మంది జపాన్ కు చెందిన ఓల్డ్ క్యాపిచ్చినో గుర్తుకు వస్తుంది.

Written By: Neelambaram, Updated On : June 29, 2024 3:19 pm

Suzuki Cappuccino

Follow us on

Suzuki Cappuccino: స్పోర్ట్స్ కారు జర్నీ అంటే మజానే వేరు.. రేసుగుర్రంలా దూసుకుపోయే ఇలాంటి కార్లు మార్కెట్లోకి వస్తున్నాయంటే కొందరికి ఎక్కడా లేని ఉత్సాహం ఉంటుంది. అయితే స్పోర్ట్స్ వేరియంట్ లో కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తుంటాయి. వచ్చిన వాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. లైట్ వెయిట్ ను కలిగి ఉండి, రయ్ మంటూ వెళ్లే ఈ వేరియంట్ కార్లను ఓవైపు కొనుగోలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కోసం కారు ప్రియులు ఎదురుచూస్తుంటారు. ఇలా ఎదురుచూసేవారి కోసం సుజుకీ శుభవార్త తెలిపింది. త్వరలో సుజుకీ, టయోటాలు సంయుక్తగా సరికొత్త ఎంట్రీ లెవల్ కారును తీసుకురాబోతున్నాయి. అదే సుజుకీ క్యాపిచ్చినో. ఈ పేరు వినగానే చాలా మంది జపాన్ కు చెందిన ఓల్డ్ క్యాపిచ్చినో గుర్తుకు వస్తుంది. అవును.. ఆ పాత కాపుచ్చినో ఇప్పుడు మళ్లీ వస్తోంది..

జపాన్ కు చెందిన క్యాపిచ్చినో 1991లో మార్కెట్లోకి వచ్చింది. ఇది సుజుకీ కంపెనీ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కారు. ఇందులో మీట్ టాప్ తో కూడిన రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. 657 సీసీ టర్బో ఇంజిన్ తో పనిచేస్తూ 5 స్పీడ్ మాన్యువల్, 3 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసింది. ఈ మోడల్ ముందుగా F6A ఇంజిన్ ను, ఆ తరువాత K6A ఇంజిన్ ను అమర్చారు. ఇందులో ఆల్ వీల్ డిక్స్ బ్రేక్స్, స్పీడ్ సెన్సిగ్ ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, డబుల్ విష్ బోన్ ఉన్నాయి. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలో అంటే 1991లో 15,113 కార్లు ఉత్పత్తి చేశారు. ఆ తరువాత 1998లో ఉత్పత్తిని నిలిపి వేశారు.

సుజుకీ క్యాపిచ్చినో తిరిగి 1995లో దీనిని సవరించారు. కానీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు కొత్తగా, లేటేస్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి రాబోతుంది. కొత్తగా వచ్చే క్యాపిచ్చినో పాత వెర్షన్ కంటే పూర్తిగా విభిన్నంగా ఉండనుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. 4 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల వెడల్పుతో ఉండి 1.2 మీటర్ల ఎత్తులో ఉండనుంది. 2,480 ఎంఎం బేస్ ను కలిగి ఉన్న ఈ కారు ఓపెన్ టాప్ రోడ్ స్టర్ ను కలిగి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ లు ఉండనున్నాయి.

కారు గురించి పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ ముందుగా దీనిని జపాన్ లోనే విక్రయించనున్నారు. ఆ తరువాత ఇండియాలోకి తీసుకురానున్నారు. అయితే 26 ఏళ్ల తరువాత వస్తున్న ఈ కారు ఇప్పటి వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. పెట్రోల్ ఇంజిన్ లో మార్పులు తీసుకురానున్నారు. స్పోర్ట్స్ కారు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చని ఆటోమోబైల్ ప్రతినిధులు పేర్కొటున్నారు. ఇక అన్నీ కుదరితే వచ్చే ఏడాదిలో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు.