Opposition Leader Controversy: ప్రతిపక్ష నేత వివాదం : ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ది నిజం పట్ల నిబద్ధతా.. లేక అబద్ధానికి అమ్ముడు పోవడమా?

రాజ్యాంగం ప్రకారం.. యాంటీ డిఫెక్షన్‌ లా ప్రకారం.. ఒక పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధి పార్టీ మారితే.. అటోమేటిక్‌గా అతని పదవి పోతుంది. కానీ, ఇక్కడ చట్టం ఎక్కడా అమలు కావడం లేదు.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 3:00 pm

Opposition Leader Controversy

Follow us on

Opposition Leader Controversy: తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. లేఖలో ఇందుకు కొన్ని అంశాలను కోట్‌ చేశారు. పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది. దీనిపై టీవీ ఛానెళ్లు కూడా డిబేట్లు నిర్వహించాయి. ఈ డిబేట్లలో న్యాయవాదులు, పొలిటికల్‌ ఎనలిస్టులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, పొలిటికల్‌ ఎనలిస్టు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ టీవీ డిబేట్లతోపాటు తన సొంత యూట్యూబ్‌ చానెల్‌లో వైఎస్‌.జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై చేసిన వాదన ఇపుపడు కాంట్రవర్సీగా మారింది.

స్పీకర్‌ గుర్తిసేనే హోదా..
చట్టం, రాజ్యాంగం ఏం చెబుతున్నా.. రాష్ట్రాల అసెంబ్లీల్లో అయినా.. లోక్‌సభ, రాజ్యసభలో అయినా ప్రతిపక్ష హోదా రావాలంటే.. స్పీకర్‌ ప్రభుత్వ వ్యతిరేక పార్టీ శాసన సభాపక్ష నేతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి. అప్పుడే ఆ హోదా దక్కుతుంది. ప్రతిపక్ష హోదా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రికి ఉండాల్సిన అన్నిరకాల వసతులు ప్రతిపక్ష నేతకు ఉంటాయి. ప్రభుత్వం నుంచి వేతనం కూడా అందుతుంది. ఇక ప్రతిపక్ష నేతగా గుర్తింపు దక్కని పక్షంలో పార్టీ తరఫున శాసన సభాపక్ష నేతగానే మిగిలిపోతారు. దీంతో ఎమ్మెల్యేకు వచ్చినట్లుగానే వేతనాలు వస్తాయి. ప్రత్యేక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక వేతనం ఏదీ అందదు.

ఇక రాజ్యంగం ఏం చెబుతోంది..
రాజ్యాంగం ప్రకారం.. యాంటీ డిఫెక్షన్‌ లా ప్రకారం.. ఒక పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధి పార్టీ మారితే.. అటోమేటిక్‌గా అతని పదవి పోతుంది. కానీ, ఇక్కడ చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. స్పీకర్‌ తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అవుతోంది. చట్టం చెప్పినా.. రాజ్యాంగంలో ఉన్నా.. సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నా.. ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల విఫయంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి తరఫున స్పీకర్‌ తీసుకునే రాజకీయ నిర్ణయమే ఫైనల్‌ అవుతోంది. ఇందుకు 2019లో లోక్‌సభ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక 2018 తర్వాత తెలంగాణ అసెంబ్లీలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కూడా స్పీకర్‌ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అంటే స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు.. అంటే అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన ప్రధాని, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయమే అల్టిమేట్‌గా స్పీకర్‌ ద్వారా చెప్పిస్తున్నారు.

ఏపీ 1953 చట్టంలో ఇలా..
ఇక ఏపీ అసెంబ్లీ 1953లో చేసిన చట్ట ప్రకారం.. పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే.. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాను ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే.. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని గతంలో అసెంబ్లీ వేదికగానే జగన్‌ అన్నారు. ఇప్పుడు ఆయన పది శాతం సీట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదని స్పీకర్‌కు లేఖ రాయడం ద్వారా తాను పదవి లేకుండా ఉండలేనన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది.

ఏపీలో కూడా అంతే..
ఇపుపడు ఏపీలో కూడా జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే.. స్పీకర్‌ స్వతంత్రంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అనుసరించి ఇవ్వొచ్చు. కానీ, ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకుంటే.. అదే ఫైనల్‌ అవుతుంది అంటున్నారు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌. రాజ్యాంగంలోని 1977 ప్రకారం.. 10 శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని వాదిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో గతంలో బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పనటికీ ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ప్రజల్లోకి తీసుకెళ్లేలా..
ఇక ప్రతిపక్ష హోదా అడిగినా ఇవ్వలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్‌ స్పీకర్‌కు లేఖ రాసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల తరఫున వాయిస్‌ వినిపించకుండా చేయడానికే టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహం జగన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిషయమై ప్రజల్లో చర్చ జరగాలన్న జగన్‌ వ్యూహం ఫలించినట్లుగానే కనిపిస్తోంది. ఇక అసెంబ్లీలో జగన్‌కు సమయం ఇవ్వనప్పుడు.. ప్రజా సమస్యలను లేవనెత్తినప్పుడు మైక్‌ కట్‌ చేసినప్పుడు జగన్‌ లక్ష్యం ప్రజల్లోకి ఇంకా జనంలోకి వెళ్తుంది.

అయితే చట్టం ఎలా ఉన్నా.. రాజ్యాంగంలో నిబంధనలు ఎలా ఉన్నా.. ప్రతిపక్ష నేత ఉంటేనే చట్ట సభల్లో ప్రజల వాయిస్‌ వినిపించే అవకాశం ఉంటుంది అన్నది మాత్రం నిజం అయితే నాగేవ్వర్‌ మాత్రం ఏకపక్షంగా జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిబేట్లలో సూచించడం, దానికి రాజ్యాంగం, చట్టాలను చూపించడం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది.