Vivo T3 Lite 5g: భారీ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

వివో టీ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.56 అంగుళాల హెచ్‌డీ+ఎల్‌సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ పీక్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ (రోమ్) ఇంటర్నల్ స్టోరేజ్ పొందుపరిచారు.

Written By: Neelambaram, Updated On : June 28, 2024 12:55 pm

Vivo T3 Lite 5g

Follow us on

Vivo T3 Lite 5g: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ‘వీవో’ నుంచి మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ‘వీవో టీ3 లైట్ 5జీ’ని రెండు రోజుల క్రితం కంపెనీ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం 5జీ కనెక్టివిటీతో చవకైన స్మార్ట్ ఫోన్లలో ఇదీ ఒకటి. ఐపీ -64 రేటింగ్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలతో అట్రాక్షన్ గా ఉంది. వివో టీ3 లైట్ 5జీ టీ3 ఎక్స్, టీ3 లాంచ్ తర్వాత దేశంలో ప్రస్తుతం ఉన్న వివో టీ3 లైనప్ లో చేరుతుంది.

వివో టీ3 లైట్ 5జీ ధర ఎంతంటే?
వివో టీ3 లైట్ 5జీ 4జీబీ ర్యామ్ + 128 జీబీ (రోమ్) స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.10,499 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. ఫ్లిప్ కార్ట్ లో, వివో ఇండియా వెబ్ సైట్స్, ప్రధాన అఫ్లయిన్ రిటైల్ స్టోర్ల ద్వారా జూలై 4 మధ్యాహ్నం ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కానుంది.

హెచ్‌డీఎఫ్‌సీ. ఐసీఐసీఐ బ్యాంకలు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఆఫర్ల తర్వాత టీ3 లైట్ 5జీ ప్రారంభ ధర రూ.9,999.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వివో టీ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.56 అంగుళాల హెచ్‌డీ+ఎల్‌సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ పీక్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ (రోమ్) ఇంటర్నల్ స్టోరేజ్ పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

వివో టీ3 లైట్ 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది, ఇందులో ఏఐ ఆధారిత 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ లో 8 మెగా పిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

వివో టీ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. కనెక్టివిటీ విషయానికొస్తే, ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, యుఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ కలిగి ఉంది.