Bollywood Star Hero: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులలో ఏ పాత్రలో అయినా నటించి జీవించగలిగే కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ‘నవాజుద్దీన్ సిద్ధికి’ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో సేవలను అందిస్తూ వస్తున్నారు. ఒక డిఫరెంట్ పాత్ర ఉంది అంటే అందులో కచ్చితంగా నవాజుద్దీన్ సిద్ధికి ని తీసుకోవాలని ఆ దర్శక నిర్మాతలు ఆలోచిస్తూ ఉంటారు.
నిజానికి ఈయన తెలుగులో పెద్దగా మన ప్రేక్షకులకు పరిచయం లేదు. అయినప్పటికీ రీసెంట్ గా వెంకటేష్ హీరోగా శైలేష్ కోలన్ దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ సినిమాలో విలన్ గా నటించాడు… ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొన్ని రోజుల నుంచి నవజుద్దీన్ సిద్ధికి ఆయన భార్య అయిన ఆలియాల మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక అందులో భాగంగానే తన భార్య అయిన ఆలియా నుంచి విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొన్ని కామెంట్లను కూడా చేసింది. ఇలా వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది ఈ విషయం మీద నవాజ్ కూడా పలుసార్లు క్లారిటీని ఇచ్చాడు.
ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో అయితే వాళ్లు ఇద్దరు కలిసి ఉంటున్నారు. కానీ తరచుగా ఇంతకుముందు విభేదాలు వచ్చేవని తెలుస్తుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజ్ అసలు పెళ్లి చేసుకోవడమే దండగ అంటూ కొన్ని కామెట్లు చేశాడు. పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరు మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ అనేది మిస్ అవుతుందని ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే ఒకరి మీద ఒకరికి మంచి ఇంప్రెషన్ ఉండి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుందని పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు ఏమి ఉండదు.
అంటూ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. ఇక ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి నవాజుద్దీన్ సిద్ధికి, ఆలియా ఇద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ రీసెంట్ గా వాళ్ళు కలిసి వాళ్ళ 14వ వివాహ వార్షికోత్సవాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు…