Viral Farmer Invention: అవసరం నుంచి ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు దారితీస్తుంది. అలాంటి ఆలోచనల వల్లే ఈ భూమ్మీద రకరకాల ఆవిష్కరణలు పుట్టాయి. ఆ తర్వాత అవి సరికొత్త చరిత్రకు దారితీసాయి. ఆపిల్ పండు పైకి ఎందుకు ఎగరలేదు అనే సందేహం నుంచి మొదలుపెడితే.. కృత్రిమ మేథ వరకు మనిషి కనుక్కున్న ప్రతి ఆవిష్కరణ కూడా గొప్ప ఫలితాలను అందించింది. అద్భుతమైన పురోగతిని సాధించడానికి కారణమైంది. నేటి కాలంలో అరచేతిలో ప్రపంచం ఎండిపోతోందంటే దానికి ప్రధాన కారణం మనిషి కనుగొన్న ఆవిష్కరణలే. అయితే అప్పుడప్పుడు మనుషులు చేసే ప్రయోగాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. కాకపోతే ఆ ఆవిష్కరణలు చూసేందుకు నవ్వును తెప్పిస్తాయి. అలాంటి ఆవిష్కరణే ఇది కూడా. కాకపోతే అతడు చేసిన ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తోంది.
Also Read: దూరం నుంచి చూస్తే గోడలు.. దగ్గరికెళ్తే షాక్.. అలా ఎలా సాధ్యమైంది భయ్యా: వైరల్ వీడియో
ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వ్యవసాయ పనులకు కూలీల కొరత కూడా తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులు స్వయంగా తమ పనులు తామే చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఆవిష్కరణలను తెరపైకి తెస్తున్నారు. అవి చూసేందుకు వింతగా ఉంటున్నాయి. వినూత్నంగా దర్శనమిస్తున్నాయి. కాకపోతే రైతులకు కూలీల కొరతను తీర్చుతున్నాయి. సమయాన్ని ఆదా చేయడంతో పాటు.. అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తున్నాయి. ఇలా ఒక యువరైతు చేసిన ఆవిష్కరణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగా అయితే ఆ పని చేయడానికి చాలామంది కూలీల అవసరం పడుతుంది. కానీ అలాంటిదేమీ లేకుండా ఒక సైకిల్.. స్క్రూలు బిగించే యంత్రంతో అతడు చేస్తున్న పని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతే కాదు తోటి రైతులకు కూడా వినూత్న ఆవిష్కరణ లాగా దర్శనమిస్తోంది. ఇంతకు అతడు ఏం చేశాడంటే..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. స్క్రూలు బిగించే యంత్రంతో ఓ వ్యక్తి మొక్కజొన్న కంకుల గింజలను ఒలుస్తున్నాడు. స్క్రూలు బిగించే యంత్రాన్ని మొక్కజొన్న కంకికి కుచ్చుతున్నాడు. ఆ తర్వాత సైకిల్ పుల్లల మధ్యలో ఆ కంకిని ఉంచుతున్నాడు. ఆ తర్వాత స్క్రూ బిగించే యంత్రాన్ని ఆన్ చేస్తున్నాడు. ఆ యంత్రం వల్ల కంకి గుండ్రంగా తిరుగుతున్నది. సైకిల్ పుల్లల మధ్యలో ఉంచడం వల్ల గింజల మొత్తం కిందికి రాలిపోతున్నాయి. ఇలా అతడు చూస్తుండగానే భారీగా మొక్కజొన్న కంకులను మొత్తం ఒలిచేశాడు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేస్తోంది..
Also Read: ఖర్జూర పండ్లను లొట్టలు వేసుకుని తింటాం కదా.. అవి మనదాకా రావడానికి ఎంత ప్రయాస ఉందో తెలుసా?
రైతులను మించిన శాస్త్రవేత్తలు ఎవరూ లేరు. వారు తమ అవసరానికి తగ్గట్టుగా ఆవిష్కరణలను కనుగొంటారు. ప్రస్తుతం రైతులు వాడుతున్న నాగలి, గొర్రు, ఇతర పరికరాలు వారు సొంతంగా తయారు చేసుకున్నవే. అవన్నీ కూడా వారికి ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. నవీన కాలంలో అందుబాటులోకి వచ్చిన యంత్ర పరికరాలు రైతులు తయారుచేసిన పనిముట్ల ను చూసే రూపొందించారు. ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తల కంటే రైతే గొప్పవాడు. ఇక మొక్కజొన్న కంకులను ఒలవడానికి ఈ రైతు చేసిన ప్రయోగం మామూలుది కాదు. అతడికి నోబెల్ బహుమతి ఇచ్చినా తక్కువేనని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.